Minister Harish Rao Emotional Speech: మంత్రి హరీష్ రావు ఎమోషనల్ అయ్యారు. సిద్దిపేట ప్రజలు చూపిస్తున్న అభిమానానికి తన కళ్లలో నీళ్లు వస్తున్నాయని అన్నారు. మీకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే అని అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 'మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కువే.. ఇంకా మీకు చాలా సేవ చేయాలి. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు.. చివరి శ్వాస వరకు సేవ చేస్తా.
మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిఇచ్చిన తక్కువే. ఈ గడ్డ గులాబీ అడ్డా.. రానే రాదు అన్న తెలంగాణను.. కానే కాదు అన్న కాళేశ్వరంను కట్టి మండుటెండల్లో మత్తల్లు దుంకిస్తున్నారు కేసీఆర్. 138 కోట్ల రూపాయల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పండితే నేడు 1548 కోట్లు రూపాయల వడ్లు పండుతున్నాయి..' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.
👉మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.
👉 మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కువే, ఇంకా మీకు చాలా సేవ చేయాలి.
👉 మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు, చివరి శ్వాస వరకు సేవ చేస్తా. pic.twitter.com/g5Op9Fiyky— Office of Harish Rao (@HarishRaoOffice) April 9, 2023
తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. సిద్దిపేట ప్రజలు దయ.. సీఎం కేసీఆర్ దయతో తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నానని అన్నారు.
Also Read: IMD Alert: వచ్చే 5 రోజులు భారీ ఎండలు.. హెచ్చరించిన ఐఎండీ..
కాంగ్రెస్, టీడీపీ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందిందని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తెలంగాణపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని వివర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న మోదీ.. తెలంగాణకు రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని.. తెలంగాణలో మాత్రమే పెన్షన్ అందజేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే గృహలక్ష్మీ పథకం తీసుకువస్తున్నామని తెలిపారు.
Also Read: Singareni Mines Issue: సింగరేణి ప్రైవేటీకరణపై మండిపడిన కేటీఆర్, రెండు రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook