Bald Head Treatment: ఉల్లిపాయ రసంలో దీనిని కలిపి తలకు రాసుకుంటే 30 రోజుల్లో జుట్టు రావడం ఖాయం

Onion Juice for Bald Head: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది చిన్న వయసులోనే బట్టతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రసాన్ని అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు మీరు త్వరలోనే చూస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 08:16 PM IST
Bald Head Treatment: ఉల్లిపాయ రసంలో దీనిని కలిపి తలకు రాసుకుంటే 30 రోజుల్లో జుట్టు రావడం ఖాయం

Onion Juice for Bald Head: జన్యుపరమైన కారణాలవల్ల చాలామందిలో బట్టతల సమస్యలు పెరిగిపోతున్నాయి. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా కొన్ని ఆహారాల వల్ల వ్యాధుల కారణంగా కూడా బట్టతల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుల సమాచారం మేరకు మార్కెట్లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. వీటిని వినియోగించడం మంచిదైనప్పటికీ కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలకు గురి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఉల్లిపాయతో చేసిన రెసిపీని వినియోగించండి. అందులో ఉండే గుణాలు జుట్టును రప్పించడమే కాకుండా అన్ని రకాల సమస్యలను దూరం చేస్తాయి. 

ఉల్లి వల్ల కలిగే లాభాలు:
ఉల్లిలో సల్ఫర్‌తో పాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఉల్లి రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు సల్ఫర్ లభించి జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా తయారవుతుంది. అంతేకాకుండా బట్టతల ప్రదేశంలో జుట్టు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

బట్టతల నుంచి నిజంగా ఉపశమనం లభిస్తుందా..?
ప్రముఖ నిపుణులు నాలుగు వారాలపాటు ఉల్లిపాయ రసాన్ని బట్ట తలపై ప్రయోగం చేయక 74 శాతం మందిలో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే చాలామందిలో టెలోజెన్ ఎఫ్లూవియం లేదా ఆండ్రోజెనెటిక్ అలోపేసియా కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.  కాబట్టి తరచుగా ప్రోటీన్ లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందా..?
వాతావరణంలో తేమ పెరగడం కారణంగా చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చర్మ సౌందర్యం ఉల్లిపాయ రసాన్ని కూడా వినియోగించవచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే యాక్సిడెంట్లు పరిమాణాలు జుట్టును దృఢంగా చేయడమే కాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగించకుండా ఈ రసాన్ని వినియోగించడం చాలా మంచిది. 

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News