White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

White Hair Solution: తెల్ల జుట్టు, ఇతర సమస్యలతో బాధపడేవారు ఈ మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చు. మీరు కూడా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడితే ఈ చిట్కాను పాటించండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 09:14 AM IST
White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

Hair White Problem Solution: జుట్టు వల్లే ముఖం అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఒత్తైన, అందమైన జుట్టును పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పొందలేకపోతున్నారు. అయితే ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తున్నాయని కాబట్టి ఈ సమస్యల నుంచి సహజంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల సులభంగా ఒత్తైన, అందమైన జుట్టును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గ్రేప్ జ్యూస్ హెయిర్ మాస్క్‌(Grape Juice Hair Mask) ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును స్మూత్‌గా, మెరిసేలా చేస్తుంది. కాబట్టి తప్పకుండా జుట్టు సమస్యలతో బాధపడేవారు దీనిని వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ద్రాక్ష రసాన్ని జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యలేకాకుండా నల్లగా మారుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రేప్ జ్యూస్ హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడ తెలుసుకుందాం.

ద్రాక్ష హెయిర్ మాస్క్ (Grape Juice Hair Mask) చేయడానికి కావలసిన పదార్థాలు:
3 టీ స్పూన్ల ద్రాక్ష రసం
2 టీ స్పూన్ల టీ లీఫ్ నీరు
 2 టీస్పూన్ల టీ ఆకులు

Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్‌, బీపీకి శాశ్వతంగా చెక్‌!

ద్రాక్షహెయిర్ మాస్క్‌ను ఇలా తయారు చేయండి:
ద్రాక్షహెయిర్ మాస్క్‌ను చేయడానికి ముందుగా ఓ బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ బౌల్‌లో 3 టీస్పూన్ల ద్రాక్ష రసం,  2 టీస్పూన్ల టీ ఆకుల మిశ్రమం వేయాలి.
ఈ రెండింటిని మిశ్రంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా మిక్స్‌ చేసుకుని ఓ డబ్బలో భద్రపరుచుకుంటే ద్రాక్ష హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే..

ఈ మాస్క్‌ను ఎలా అప్లై చేయాలి?
ఈ మాస్క్‌ను అప్లై చేసుకోవడానికి ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
జుట్టుకు హెయిర్ మాస్క్‌ను బాగా అప్లై చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి.
ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్‌, బీపీకి శాశ్వతంగా చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News