RCB Vs MI Highlights: ముంబై బౌలర్లకు చుక్కలు.. చెలరేగిన విరాట్ కోహ్లీ, డుప్లెసిస్

RCB Won By 8 Wickets Against Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సంప్రదాయం కొనసాగించింది. 2013 నుంచి మొదటి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై.. ఈ సీజన్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్లతో విజయం సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2023, 11:38 PM IST
RCB Vs MI Highlights: ముంబై బౌలర్లకు చుక్కలు.. చెలరేగిన విరాట్ కోహ్లీ, డుప్లెసిస్

RCB Won By 8 Wickets Against Mumbai Indians: చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాట్స్‌మెన్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఐపీఎల్ 2023 సీజన్ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. విరాట్ కోహ్లీ (82 నాటౌట్), డుప్లెసిస్ (73) మెరుపులు మెరిపించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని కేవల 16.2 ఓవర్లనే ఛేదించింది. వీరిద్దరు చెలరేగి ఆడుతూ గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైను తక్కువ స్కోరుకే కట్టడి చేశరు. తిలక్ వర్మ ఆడకపోతే ముంబై 100 లోపే ఆలౌట్ అయ్యేది. 

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ముంబై బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును తొలి 6 ఓవర్లలో 53 పరుగులు జోడించారు. ఆ తరువాత డు ప్లెసిస్, కోహ్లీ బౌండరీల వర్షం కురిపిస్తూ లక్ష్యాన్ని కరిగించారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ క్రమంలో బౌలర్లను మార్చినా.. ఈ జోడి జోరును ఆపలేకపోయారు. 

వీరిద్దరు దూకుడుతో 11వ ఓవర్‌లోనే ఆర్‌సీబీ స్కోరు 100 పరుగులు దాటించింది. డుప్లెసిస్ కేవలం 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. విజయం ఖాయమైన తరువాత 43 బంతుల్లో 73 పరుగులు చేసిన డుప్లెసిస్.. భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 148 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత దినేష్ కార్తీక్ (0) పరుగులేమి చేయకుండా ఔట్ అయ్యాడు. చివర్లో మ్యాక్స్‌వెల్ (3 బంతుల్లో 12, రెండు సిక్సర్లు) రెండు భారీ షాట్లు ఆడాడు. విరాట్ కోహ్లీ సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు. 49 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ సేన.. కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ వేగంగా పరుగులు చేశాడు. తిలక్ వర్మ 46 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేయడంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ తన 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ  

Also Read: RCB vs MI Match Updates: ఐపీఎల్‌లో మరో సూపర్ ఫైట్.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News