Healthy Drink: పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కేవలం శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చేయడమే కాదు..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. క్రమం తప్పకుండా పుచ్చకాయను సీజన్‌లో తీసుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చు.
పుచ్చకాయ అనేది వాటర్ కంటెంట్ ఫ్రూట్. అందుకే వేసవిలో అద్భుతమైంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయను జ్యూస్ లేదా సలాడ్ రూపంలోనే కాకుండా మిల్క్ షేక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేకాదు..బరువు తగ్గించేందుకు, రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాటర్ మెలన్ మిల్క్ షేక్ రుచిపరంగా కూడా చాలా బాగుంటుంది.
How to make watermelon milkshake
పుచ్చకాయతో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలి
1 కప్పు పుచ్చకాయ ముక్కలు
పావు కప్పు కస్టర్డ్ మిల్క్ లేదా 2 కప్పుల పాలు
ఒకటిన్నర కప్పుల నీళ్లు
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్
ఇష్టమైన ఐస్‌క్రీమ్
ఐస్‌క్యూబ్స్
పంచదార
ముందు పుచ్చకాయను ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత కండెన్స్ మిల్క్, పుచ్చకాయ ముక్కల్ని కూలింగ్ కోసం ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత పుచ్చకాయ ముక్కలు, కండెన్స్‌డ్ మిల్స్, నీళ్లు , వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌లను మిక్సర్ జార్‌లో వేసి మిక్సీ చేయాలి. ఆ తరువాత అన్నింటినీ బాగా మిక్స్ చేసి షేక్ తయారు చేయాలి. మీకిష్టమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన మిల్క్ షేక్ సిద్ధమైనట్టే. సర్వింగ్ గ్లాసులో ఐస్‌క్రీమ్ గార్నిష్ చేసి చిల్డ్‌గా సర్వ్ చేయాలి.
Also read: Food Habits: రోజూ పరగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తీసుకుంటే కలిగే అనర్ధాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Healthy Drink: వాటర్ మెలన్ మిల్క్ షేక్‌తో కేవలం 5 వారాల్లో బరువు తగ్గడం ఖాయం