White Hair Problem In Teenage Solution: ప్రస్తుత చాలా మంది చిన్న వయసుల్లోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో జుట్టు రాలడం, బట్టతల సమస్యలు వస్తున్నాయి. అయితే చాలా మందిలో వేగంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తొందరగా బట్టతలతో పాటు తెల్ల జుట్టు సమస్యల వస్తాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి నూనెతో కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది:
1. కొబ్బరి నూనె, హెన్నా:
కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే హెన్నా సహజమైన జుట్టు రంగు అయినప్పటికీ కొబ్బరి నూనెలో హెన్న కలుపుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ రెసిపీని తయారు చేయడానికి ముందుగా.. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను ఒక బౌల్ వేసి బాగా మరిగించాలి. అందులోనే ఎండలో ఉంచి గోరింట ఆకులను గ్రైడ్ చేసి పొడిని పోసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
2. కొబ్బరి నూనె, ఉసిరికాయ:
కొబ్బరి నూనె, ఉసిరి మిశ్రమం తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చుండ్రును తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే ఈ మాస్క్‌ను వినియోగించడానికి ముందుగా 4 చెంచాల కొబ్బరి నూనెను తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే 3 చెంచాల ఉసిరి పొడిని కలపండి..ఇలా తయారు చేసిన పేస్ట్ చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. ఈ పేస్ట్‌తో జుట్టుకు మసాజ్ చేసి రాత్రిపూట అలానే ఉంచి ఉదయం లేచిన తర్వాత శుభ్రం చేసుకుంటే చాలా తొందలోనే మంచి ఫలితాన్ని పొందొచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
White Hair To Turn Black: ఈ నూనెతో తెల్ల జుట్టు కేవలం 4 రోజుల్లో నల్లగా మారడం ఖాయం!