అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులుగా గుర్తింపు

వలసదారులు గుర్తించేందుకు అస్సాం సర్కార్ నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) లిస్టును విడుదల చేసింది.

Last Updated : Jul 30, 2018, 03:04 PM IST
అస్సాంలో 40 లక్షల మంది అక్రమ వలసదారులుగా గుర్తింపు

వలసదారులను గుర్తించేందుకు అస్సాం సర్కార్ నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) లిస్టును విడుదల చేసింది. దీని ప్రకారం 3,29,91,385 జనాభాలో 2,89, 83,677 మంది మాత్రమే అర్హులని పేర్కొన్న ప్రభుత్వం.. భారీ భద్రత మధ్య లిస్టును ప్రకటించింది. అయితే ఇది తుది జాబితా కాదన్న ఎన్‌ఆర్‌సీ కో-ఆర్డినేటర్ ప్రతీక్‌ హజేలా.. అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా ఈ లిస్టుతో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి అస్సాం రాష్ట్రం పౌరసత్వం ఇవ్వనుంది.

 

అంతకుముందు ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్‌గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌ను విధించారు.

1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తించారు. అయితే గతేడాది అస్సాం ప్రభుత్వం డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందే అస్సాం పౌరులని చెప్పిన విషయం తెలిసిందే.కాగా.. తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంకెల్లో అస్సాం

3.20 కోట్ల మంది జనాభా ఉన్న అస్సామ్‌లో మూడో వంతు ముస్లింలే. భారతదేశంలోని అత్యధిక ముస్లింల జనాభా శాతం ఉన్న రెండో రాష్ట్రం ఇది.

1951లో ఎన్‌ఆర్‌సీ తొలి జాబితాలో అస్సాం జనాభా 80 లక్షలు

అస్సాం ప్రభుత్వం డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో 1.9 కోట్ల మందే అస్సాం పౌరులని, వారికి పౌరసత్వం లభిస్తుందని పేర్కొంది.  

అస్సాంలో 50 లక్షల మంది బంగ్లాదేశీయులని 2004లో అప్పటి యుపిఎ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ పార్లమెంటులో మాట్లాడుతూ చెప్పారు. తర్వాత తన మాటలను వెనక్కు తీసుకున్నారు.

భారతదేశంలో అక్రమంగా 2 కోట్ల మంది బంగ్లాదేశ్ వలసదారులు నివసిస్తున్నారని, ఎన్డిఎ ప్రభుత్వం పార్లమెంటులో 2016లో ప్రకటించింది.

Trending News