Ice Apple Benefits: తాటి ముంజలతో కూడా ఇలా 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు.. నమ్మట్లేదా ఇది చదవండి!

Ice Apple Benefits: తాటి ముంజలను వేసవి కాలంలో ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 10:19 AM IST
Ice Apple Benefits: తాటి ముంజలతో కూడా ఇలా 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు.. నమ్మట్లేదా ఇది చదవండి!

Ice Apple Benefits: వేసవి కాలంలో చాలా రేర్‌గా లభించే పండ్లలో తాటి పండు ఒకటి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్య పొందిన పండు.. ఇది గుండ్రని ఆకారంలో ఉండి లోపల మృదువైన గుజ్జును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆ గుజ్జులో నీరు కూడా ఉంటుంది. దీనినే ముంజలు అంటారు. ఇది తెలంగాణలో ప్రతి గ్రామంలో లభిస్తుంది. అయితే తాటి ముంజలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో క్యాలరీలు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని తినడం వల్ల సీజన్‌ మారడం వల్ల వచ్చే  జ్వరం, తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గడం:

 వేసవిలో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తాటి ముంజలను క్రమం తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ఆకలి నియంత్రించి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండ వీటిని ప్రతి రోజూ తింటే శరీర రిఫ్రెస్‌గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇవి లభిస్తే తప్పకుండా ట్రై చేయండి.

రొమ్ము క్యాన్సర్, మశూచి:
ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఆంథోసైనిన్ అనే ఫైటోకెమికల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కణాలు, ట్యూమర్ల పెరుగుదలను క్రమంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల క్యాన్సర్ల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

వడ దెబ్బ:
ఎండా కాలం కారణంగా చాలా మంది వడ దెబ్బ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తాటి ముంజలను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వడ దెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది:
తాటి ముంజల్లో నీటిని పరిమాణం అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని తినడం వల్ల చర్మం పొడిబారడం, శరీర హైడ్రేషన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Best Mileage Petrol Car: రూ. 5.3 లక్షలకే అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News