Simple Tips For Lose Belly Fat In 12 Days: బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే దీనిని ఎంత సులభంగా తగ్గించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది బెల్లీ ఫ్యాట్ కారణంగా గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపు మార్పుల కారణంగా సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే సింపుల్ చిట్కాలు:
బెల్లీ ఫ్యాట్ అధిక పరిమాణంలో పెరగడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
స్వీట్లు తక్కువ తినండి!
బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణం రోజూ తినే తీపి పదార్థాలే! కాబట్టి బేకరీ ఫుడ్స్, కొన్ని రకాల ఐస్ క్రీమ్స్, స్వీట్స్ వంటి చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. వీటికి దూరంగా ఉండడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు అంతేకాకుండా తీవ్ర వ్యాధులు కూడా దూరమవుతాయి.
ఒక గ్లాసు నిమ్మరసం తాగండి:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఖాళీ కడుపుతో దీనిని తాగితే సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి ఉపశమనం కలిస్తుంది.
జీలకర్ర నీరు:
రెండు టీస్పూన్ల జీలకర్రను నీళ్లతో మరిగించి రోజూ ఒక గ్లాసు తాగితే పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గ్రీన్ టీ తాగాలి:
ప్రతిరోజూ పాలు లేకుండా రెండు గ్లాసుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు కొవ్వును కరుగుతుంది. అంతేకాకుండా మధుమేహం కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి సులభంగా బరువు, మధుమేహం తగ్గడానికి గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది.
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook