Turn your White Hair to Black with Henna in just 2 Minutes: వయస్సు పెరిగే కొద్దీ చర్మంతో పాటు జుట్టులో కూడా మార్పులు వస్తాయి. ఇలాంటి సమస్యలు పెద్దవారిలోనే కాకుండా చిన్న వయస్సులో కూడా ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చాలా మంది రసాయనాలతో కూడిన పలు ఉత్పత్తుల వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్ తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు సహజంగా తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించడం చాలా మంచిది. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల శాశ్వతంగా జుట్టు నల్లగా మారుతుంది. అయితే మెహెందీతో తయారు చేసిన హెయిర్ కలర్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది:
మెహందీని ఇలా వినియోగించండి చాలు:
జుట్టు నల్లగా మారడానికి హెన్నా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఖాళీ హెన్నాను వినియోగించకుండా అందులో పలు మిశ్రమాలను వినియోగిస్తే మంచి ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం హెన్నాలో టీ లీఫ్ వాటర్, కాఫీ వాటర్ లేదా ఉసిరి పొడి వేసి మిశ్రంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకునున్న మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హెన్న మిశ్రమం వినియోగించే పద్ధతి:
దీని కోసం ముందుగా జుట్టు శుభ్రం మంచి నీటితో కడగాల్సి ఉంటుంది. ఆ తర్వాత జుట్టుకు బాగా హెన్న మిశ్రమాన్ని పట్టించాలి. 25 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేసే క్రమంలో కేవలం తేలిక పాటి షాంపూలకు మాత్రమే వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా మీరు శాశ్వతంగా నల్లని జుట్టు పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి తీవ్ర సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
షాంపూని ఇలా వినియోగించాల్సి ఉంటుంది:
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడి షాంపూలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి బదులుగా ఆర్గానిక్ షాంపూలను మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వారంలో 3 నుంచి 2 సార్లు మాత్రమే జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కవ సార్లు షాంపూతో జుట్టును శుభ్రం చేస్తే చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా అతిగా తల స్నానం చేయడం మానుకోండి.
కొన్ని రోజుల తర్వాత మాత్రమే మీ జుట్టును కడగడానికి ప్రయత్నించండి. రోజూ జుట్టును కడగడం వల్ల నలుపు మరియు ముదురు రంగులు తేలికగా మారడం ప్రారంభిస్తాయి మరియు కొద్ది రోజుల్లోనే తెల్లటి జుట్టు మళ్లీ తలపై మంచు షీట్ లాగా వ్యాపించడం ప్రారంభమవుతుంది. కనీసం 2 నుండి 3 రోజుల వ్యవధిలో మీ తలను కడగాలి.
Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
White Hair To Black with Henna: తెల్ల జుట్టు నుండి 2 నిమిషాల్లో తక్షణ ఉపశమనం.. గోరింటాకుతో ఇలా చేయండి చాలు