Ecuador Earthquake News Updates: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన విధ్వంసం మర్చిపోకముందే.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైంది. భూకంపం కారణంగా నగరవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. ఇళ్లతో పాటు పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని ఈక్వెడార్‌లో భూకంపం సంభవించిన వెంటనే.. నగరమంతా భయాందోళన వాతావరణం ఏర్పడింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం గుయాస్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో సోషల్ మీడియా ద్వారా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. భూకంప నష్టాన్ని వెంటనే సరిచేయడానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని చెప్పారు.
భూకంపం వల్ల ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 12 మంది మరణించారని.. అజువే ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించారని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు మూసుకుపోయాయి. శాంటా రోసా విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెట్రోఎక్వెడార్ ముందు జాగ్రత్తగా కార్యకలాపాలను నిలిపివేసింది. భవనాలను ఖాళీ చేయించింది.
"ఒక్కసారిగా భూమి ఊగుతున్నట్లు అనిపించింది. మేమంతా వీధుల్లోకి పరిగెత్తాము. మాకు చాలా భయం వేసింది" అని భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ఇస్లా పునా నివాసి ఎర్నెస్టో అల్వరాడో తెలిపారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. మొదట భూకంపం వచ్చిన తరువాత గంటలో రెండు బలహీనమైన అనంతర ప్రకంపనలు సంభవించాయని ఈక్వెడార్ జియోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అదేవిధంగా దేశంలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించిందని.. ప్రజలకు లేదా నిర్మాణాలకు హాని జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని పెరూ అధికారులు తెలిపారు.
టర్కీలో భూకంపం సృష్టించిన ప్రళయంలో 50 వేలమందికిపై మరణించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న భూకంపం సంభవించగా.. రిక్టారు స్కేలుపై 7.8 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం దక్షిణ టర్కీలోని గాజియాంటెప్‌లో గుర్తించారు. ఈ భారీ భూకంపం నుంచి టర్కీ, సిరియా ప్రజలు ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నారు.
Also Read: New Pay Scale: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెరవేరిన 23 ఏళ్ల కల.. కొత్త పే స్కేలు వర్తింపు
Also Read: New Income Tax Rules 2023: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి