TCS Ceo Rajesh Gopinathan Resigns: దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎండీ, సీఈవో రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కొత్త సీఈఓగా కె.కృతివాసన్‌ను నియమిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ (బీఎఫ్‌ఎస్‌ఐ) గ్లోబల్ హెడ్‌గా కృతివాసన్ ఉన్నారు. గత 34 ఏళ్లుగా ఆయన టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 22 ఏళ్లపాటు టీసీఎస్‌కు సేవలు అందించిన రాజేష్ గోపీనాథన్.. తన పదవికి రాజీనామా చేశారు. గత ఆరేళ్లుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినా.. సెప్టెంబర్ నెల వరకు కంపెనీలోనే ఉంటారు.
ఈ సందర్భంగా రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ.. టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం చాలా ఉత్తేజకరమైనదని అన్నారు. ఎన్.చంద్రశేఖరన్‌తో కలిసి పనిచేసిన అనుభవం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. 10 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని.. మార్కెట్ క్యాపిటలైజేషన్ 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని చెప్పారు. కొన్ని కొత్త ఆలోచనలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఏడాది సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలిపారు.
కృతివాసన్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. 'గత రెండు దశాబ్దాలుగా కృతివాసన్‌తో కలిసి పనిచేశా. ఆయన సామర్థ్యం నాకు తెలుసు. టీసీఎస్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగల సమర్థుడని నేను నమ్ముతున్నాను. కృతితో కలిసి పని చేస్తా.. ఆయనకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలు అందిస్తా..' అని రాజేష్ తెలిపారు. కాగా.. ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్‌తో సహా అనేక బడా ఐటీ కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్ పదవుల్లో ఉన్న వ్యక్తుల రాజీనామాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. రాజేష్ గోపీనాథన్ పదవీ కాలం 20 ఫిబ్రవరి 2027 వరకు ఉండగా.. ఆయన ముందే రాజీనామా చేశారు.
టీసీఎస్ మన దేశంలో రెండవ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ. అదేవిధంగా అతిపెద్ద ఐటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అమెరికా మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ వారం అమెరికాలోని అత్యుత్తమ లార్జ్ ఎంప్లాయర్ల ప్రతిష్టాత్మక జాబితాలో టీసీఎఎస్‌ను పేర్కొంది. బీఎస్ఈ ప్రకారం.. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.12.19 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం టీసీఎస్‌లో 5.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Also Read: PF Account: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి
Also Read: Loan Costly: కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంక్.. ఈఎంఐలపై భారీ మోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి