Indian Army Cheetah Helicopter Crashes: అరుణాచల్ ప్రదేశ్‌లోని మాండ్లా కొండ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ కుప్పకూలింది. పైలట్ల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ మేరకు ఆర్మీ వర్గాలు సమాచారం అందించాయి. హెలికాఫ్టర్ సెంగే నుంచి మిసామారి వైపు ఎగురుతుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. అందులో పైలట్లు, కో పైలట్లు మాత్రమే ఉన్నారు. ఈరోజు ఉదయం 9.15 గంటల ప్రాంతంలో చిరుత హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయని గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ధృవీకరించారు.
Indian Army Cheetah helicopter has crashed near Mandala hills area of Arunachal Pradesh. Search operation for the pilots has started. More details awaited: Army sources pic.twitter.com/fqD0uu767w
— ANI (@ANI) March 16, 2023
అరుణాచల్ ప్రదేశ్ విమాన కార్యకలాపాలకు అనుకూలంగా లేదు. ఈశాన్య రాష్ట్రం గతంలో పలు విమాన ప్రమాదాలకు గురైంది. గతేడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్‌లో భారత ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్‌లతో సహా ఐదుగురు సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తవాంగ్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది.
గత ఐదేళ్లలో భారత సైన్యానికి చెందిన 18 హెలికాప్టర్లు కూలిపోయాయి. గతేడాది డిసెంబరు 17న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రక్షణ మంత్రి అజయ్‌భట్ ఈ సమాచారం ఇచ్చారు. 2017 నుంచి 2021 వరకు 15 ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత మరో మూడు ప్రమాదాలు జరిగాయి. వీటిలో రెండు ప్రమాదాలు 2022 అక్టోబర్‌లోనే చోటు చేసుకున్నాయి. రుద్ర, చిరుత హెలికాప్టర్ల వంటి హెలికాఫ్టర్లు ప్రమాదానికి గురయ్యాయి.
Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి