Best Tourist Places in India: మజులి ద్వీపం ఆసియాలోనే అతి పెద్ద నదీ ద్వీపం ఇది. ఇక్కడ కాలుష్యమనేది అస్సలు ఉండదు. చుట్టూ పచ్చదనం అల్లుకుని ఉంటుంది. ఈ ప్లేస్‌ను ఒక్కసారి సందర్శిస్తే.. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
మజులి ద్వీపం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉంది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న ద్వీపం ఇదే..
మజులి ద్వీపం కాలుష్యం లేనిది. ఇక్కడ చుట్టూ పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఈ దీవిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
2016లో అస్సాం ప్రభుత్వం ఈ ద్వీపాన్ని జిల్లాగా చేసింది. ఈ ద్వీపం పరిమాణం తగ్గిపోయినా.. ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
మజులి దాదాపు 100 రకాల వరి పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు రకరకాల బియ్యం రుచి చూడొచ్చు.
ఈ ద్వీపానికి చేరుకోవడానికి పడవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పడవ ద్వారా మాత్రమే ఈ ద్వీపానికి చేరుకోవచ్చు.