Meena sankranti 2023: మీన సంక్రాంతి అంటే ఏమిటి? శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి..

Meena sankranti 2023: సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. రేపు సూర్యడు మీనరాశిలోకి  వెళ్లనున్నాడు.  దీనినే మీన సంక్రాంతి అంటారు. సూర్యభగవానుని పూజించే శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 06:33 PM IST
Meena sankranti 2023: మీన సంక్రాంతి అంటే ఏమిటి? శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి..

Meena sankranti 2023: సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన ఖగోళ సంఘటననే మీన సంక్రాంతి అంటారు. ఈరోజున సూర్యభగవానుడిని పూజించడం వల్ల మీ అన్ని కోరికలు నెరవేరుతాయి. మీన సంక్రాంతి మార్చి 15, 2023 నాడు వస్తుంది. సూర్యభగవానుని ఆరాధించే శుభ సమయం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి. 

శుభ సమయం
మార్చి 15న సూర్యభగవానుడు ఉదయం 06.47 గంటలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు రాత్రి 10 గంటల వరకు పూజించడానికి పుణ్య కాలం ఉంటుంది. ఈ రోజు గంగా నదిలో స్నానం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.

పూజా విధానం 
సూర్యోదయ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేయండి. అనంతరం సూర్య భగవానుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించండి. ఈ రోజున ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా ఇంట్లో పూజ చేసే సమయంలో ధూపం, దీపాలు, పండ్లు, పూలు, మిఠాయిలు మొదలైన వాటితో దేవుడిని పూజించడం మంచిది. పూజ తర్వాత బ్రాహ్మణులకు మరియు నిరుపేదలకు ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు. అయితే పూజ సమయంలో వేద మంత్రాలను పఠించడం శుభప్రదంగా భావిస్తారు.

ప్రాముఖ్యత 
మీన సంక్రాంతి గురించి గ్రంథాలలో చెప్పబడింది. మతపరమైన దృక్కోణం ఈరోజు చాలా పవిత్రమైనది. ఇలా చేయడం వల్ల నెగెటివిటీ తొలగిపోయి పాజిటివిటీ ప్రసరిస్తుంది. మీన సంక్రాంతి నుంచి సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. దీని కారణంగా పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. ప్రకృతిలో కొత్త సృష్టి జరిగే సమయం ఇది. ఆ సమయంలో పూజలు, ధ్యానం మరియు యోగా చేయడం వల్ల మనస్సు మరియు బుద్ధి బలపడతాయి. పురాణాల ప్రకారం, ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయి.

Also Read: Astrology: మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ 3 రాశులకు కలిసి రానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News