Chaitra Navratri Shubh Muhurat 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం ప్రారంభమైంది. ఈ సంవత్సరం చైత్ర మాసంలో ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి, ఇది అన్ని రాశుల వారికి శుభప్రదం. అంతేకాకుండా చైత్రమాసం రెండో పక్షంలో పంచగ్రహాల కూటమి ఏర్పడబోతుంది. మీనరాశిలో సూర్యదేవుడు, చంద్రుడు, బృహస్పతి, బుధుడు మరియు నెప్ట్యూన్ గ్రహాల కలయిక జరగనుంది. ఇదే రోజు హిందూ నూతన సంవత్సం కూడా మెుదలుకానుంది. ఈ పంచ గ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రాశిచక్ర గుర్తులపై ప్రభావాలు:
మిథునం (Gemini):
మిథున రాశి వారికి మీన రాశిలో ఏర్పడిన గ్రహాల కలయిక వల్ల ప్రయోజనం ఉంటుంది. కెరీర్ లో మీరు కొత్త అవకాశాలను అందుకుంటారు. దుర్గామాత ఆశీస్సులతో వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(Cancer):
గ్రహాల మహాపంచాయత్ యొక్క శుభ ఫలితాలను కర్కాటకరాశి వారికి ఉంటాయి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. దంపతులు కలిసి దుర్గాదేవిని పూజించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది.
కన్య రాశి (Virgo):
గ్రహాల కూటమి మీకు లాభసాటిగా ఉంటుంది. ఈ నవరాత్రికి మీరు ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మహిళలు బంగారం కొనుగోలు చేయవచ్చు.
మీనం (pisces):
మీన రాశిపై దుర్గామాత ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. దీంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. మీరు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Mangal Gochar 203: అరుదైన రాజయోగాన్ని సృష్టించిన కుజుడు.. ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook