Shruthi Nanduri: నండూరి ఎంకి వారసురాలు వచ్చేసింది.. 'ఆహా'లో సందడి చేస్తున్న అమెరికన్ డాక్టర్!

Shruthi Nanduri From Nanduri Family: తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా ఎంతో మంది టాలెంట్ ఉన్న మంచి సింగర్స్ ని తెలుగు వారికి పరిచయం చేస్తుండగా ఇప్పుడు మరో టాలెంటెడ్ సింగర్ వచ్చేస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 12, 2023, 02:10 PM IST
Shruthi Nanduri: నండూరి ఎంకి వారసురాలు వచ్చేసింది.. 'ఆహా'లో సందడి చేస్తున్న అమెరికన్ డాక్టర్!

Shruthi Nanduri in Telugu Indian Idol 2: 100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా కేవలం సినిమాలు, వెబ్ సీరీసులు మాత్రమే కాదు, గేమ్ షోస్, రియాలిటీ షోస్  తో పాటు.. టాక్ షోలతోనూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీ సంస్థ ఆహా ఎంతో ప్రేక్షకాదరణ పొంది మరింత ముందుకు దూసుకు పోతోంది. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడో ఉన్న ప్రతిభకు పట్టం కడుతూ ఎంతో మంది సింగర్స్ ను వెలుగులోకి తీసుకొస్తోంది.

తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా ఎంతో మంది టాలెంట్ ఉన్న మంచి సింగర్స్ ని తెలుగు వారికి పరిచయం చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ను కూడా సూపర్ హిట్ టాక్ తో పూర్తి చేసిన ఆహా.. ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అయ్యింది. ప్రస్తుతం సీజన్ 2 ఆడిషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆడిషన్స్ కు ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ దేశ విదేశాల్ల్లోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

ఇటీవల మిలిటరీ జవాన్ చక్రపాణిని కూడా పరిచయం చేసింది. మిలిటరీలో ఉండి దేశ సేవ చేసే చక్రపాణి తన గాత్రంతో అబ్బుర పరచగా ఇప్పుడు మరో మధురమైన గాత్రాన్ని పరిచయం చేసింది ఆహా. ఆ అద్భుతమైన సింగర్ పేరు పేరు శృతి నండూరి. శృతి అమెరికాలో డాక్టర్, వృత్తిపరంగా వైద్య సేవ చేస్తూనే సంగీతాన్ని కూడా సాధన చేసిన శృతి ఇప్పుడు ఆహాతో అందరినీ అలరించడానికి వచ్చేసింది.

మ్యూజిక్ ను మెడిసన్ కు కలపడమే తన గోల్ అని చెబుతున్న శృతి నండూరికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. 70 -80 లలో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన "ఎంకి" పాటల సంగీత వారసత్వం ఉన్న కుటుంబం నుండి వచ్చిన శృతికి సంగీతం పట్ల ఎప్పటినుండో మక్కువ ఉంది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 తన ప్లాట్‌ఫారమ్‌గా శృతి తన అద్భుతమైన ప్రతిభను మన ముందుకు తెస్తోంది. ఆమె అద్భుత గాత్రాన్ని మీరు వినండి.

Also Read: SS Rajamouli Birth Place: రాజమౌళి కర్ణాటకలో పుట్టాడా? అసలు శ్రీశైలశ్రీ అనే పేరు ఎందుకు వచ్చింది?

Also Read: Yash Cameo in Salaar: సలార్లో యష్.. ఆరోజునే షూట్.. ఇక రచ్చ రచ్చే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News