విటమిన్ బి12 అత్యంత కీలకమైనంది. శరీర నిర్మాణంలో చాలా అవసరం. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. న్యూరోలాజికల్ ఫంక్షనింగ్, రక్తం ఏర్పడటంలో సహాయపడుతుంది. వివిధ రకాల ఆహార పదార్ధాల్లో విటమిన్ బి 12 సమృద్ధిగా లభిస్తుంది.
మాంసం, చేప, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివాటిలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి12 లోపముంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శరీరంలో విటమిన్ బి 12 తగిన మోతాదులో ఉంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది. శరీరంలో తగిన మోతాదులో లేకపోతే..రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాకు దారి తీస్తుంది. ఫలితంగా తీవ్రమైన అలసట ఉంటుంది. తలనొప్పి, మూడ్ సరిగ్గా లేకపోవడం ఉంటుంది.
జీర్ణక్రియ
విటమిన్ బి12 లోపముంటే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పోషక గుణాల లోపంతో ఆక్సిజన్ చివరి వరకూ అస్సలు చేరదు. దీనివల్ల మలబద్ధకం, వాంటింగ్ సెన్సేషన్, స్వెల్లింగ్, గ్యాస్, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
న్యూరోలాజికల్ సమస్య
విటమిన్ బి12 లోపం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల మీ మెదడు పనితీరు బలహీనమై..మానసిక ఉదాసీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
కండరాల బలహీనత
విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఇది మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుంది. కండరాల్లో నొప్పికి కారణమౌతుంది.
చర్మంలో మార్పు
విటమిన్ బి12 లోపం వల్ల ఎనీమియా సమస్య రావచ్చు. కోబాలమిన్ లోపంగా పరిగణిస్తారు. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం తగిన రీతిలో జరగకపోతే ఈ పరిస్థితి తలెత్తతుంది. అందుకే చర్మం రంగుపై ప్రభావం పడుతుంది. చర్మం క్రమంగా పసుపు రంగులో మారుతుంది.
Also read: Best Ways For Weight Loss: ఈ డ్రింక్‌తో బెల్లీ ఫ్యాట్ పోయి 10 రోజుల్లో మంచి ఫిజిక్ రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook