Laxmi Narsihma Swamy: లక్ష్మీ నరసింహ స్వామి వారికి పెళ్లిచూపులు

Laxmi Narsihma Swamy Kalyanostavam : అమ్మవారు శ్రీ స్వామివారికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించడంతో అలిగి వచ్చిన శ్రీ స్వామి వారిని వివిధ రీతుల్లో బతిమాలి పెళ్లికి ఒప్పించడం, అలాగే శ్రీ స్వామివారి గొప్పతనాన్ని పైడితల్లి అమ్మవారికి అర్థమయ్యేలా చెప్పి పెళ్లికి ఒప్పించడం జరుగుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2023, 05:05 AM IST
Laxmi Narsihma Swamy: లక్ష్మీ నరసింహ స్వామి వారికి పెళ్లిచూపులు

Laxmi Narsihma Swamy: సింహాచలం: సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం ఆసక్తికరమైన పెళ్లిచూపులు ఘట్టం పూర్తయింది. స్వామివారికి ప్రతీ ఏడాది నిర్వహించే కళ్యాణోత్సవంలో భాగంగా ఆనవాయితీ ప్రకారం ముందుగా పెళ్ళి చూపుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవం భక్తులకు కడురమణీయంగా, కన్నుల పండువగా ఉంటుంది. కొండ దిగువ ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి పుత్రికతో శ్రీ స్వామివారికి పెళ్లిచూపులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ పెళ్లి చూపులు ఘట్టాన్నే చువర్ణోత్సవం, డోలోత్సవం అని కూడా పిలుస్తుంటారు. 

ఈ పెళ్లి చూపులు ఘట్టంలో భాగంగానే స్వామి వారు మెట్ల మార్గంలో కొండ దిగి కిందకు వస్తారు. పుష్కరిణి సత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో శ్రీ స్వామివారు ఆశీనులవుతారు. అక్కడ నుండి పరివారాలతో కలిసి శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సుపుత్రికను వివాహం చేసుకునేందుకు గాను పెళ్లి చూపుల కోసం వెళ్లడం జరుగుతుంది. అయితే అమ్మవారు శ్రీ స్వామివారికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించడంతో అలిగి వచ్చిన శ్రీ స్వామి వారిని వివిధ రీతుల్లో బతిమాలి పెళ్లికి ఒప్పించడం, అలాగే శ్రీ స్వామివారి గొప్పతనాన్ని పైడితల్లి అమ్మవారికి అర్థమయ్యేలా చెప్పి పెళ్లికి ఒప్పించడం జరుగుతుంది. 

స్వామివారి కళ్యాణోత్సవం కంటే ముందుగా ఆనవాయితీ ప్రకారం జరిగే ఈ ఘట్టం వాస్తవికతకు దగ్గరిగా కనిపిస్తుంటుంది.. భక్తులను ఆకట్టుకుంటుంది. శ్రీ స్వామివారికి వివాహం నిశ్చయం కావడంతో చువర్ణోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం తిరు వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివార్లకు, అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరగడం సాధారణమే అయినప్పటికీ.. సింహాచలంలో వరాహ లక్ష్మీ నర్సింహా స్వామి కళ్యోణోత్సవం మాత్రం అన్ని కళ్యాణోత్సవాలకు భిన్నంగా పెళ్లి చూపులు ఘట్టం నుంచి కళ్యాణం ఉత్సవాల వరకు ప్రతీ ఘట్టం కడు రమణీయంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

ఇది కూడా చదవండి : Astro Tips: ఈ చర్యలతో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

ఇది కూడా చదవండి : Ugadi 2023 date: ఉగాది ఎప్పుడు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News