Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం అదిరిపోయే ఫేస్‌ ఫ్యాక్‌! దీంతో కాంతివంతమైన చర్మం మీ సొంతం..

Skin Glowing Cream: ముఖంపై గ్లో పెంచుకోవడానికి మార్కెట్‌ లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగించుకోకుండా పలు హోం రెమిడీస్‌ను వినియోగించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని వినియోగించడం వల్ల ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2023, 04:21 PM IST
Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం అదిరిపోయే ఫేస్‌ ఫ్యాక్‌! దీంతో కాంతివంతమైన చర్మం మీ సొంతం..

Skin Glowing Cream: ప్రతి ఒక్కరూ ముఖంపై గ్లో పెరగడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. చాలా మంది  ఖరీదైన క్రీమ్స్‌, పౌడర్‌ను అప్లై చేస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత చాలా మందిలో దుష్ప్రభావాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ముఖాన్ని అందం పెంచుకోవడానికి  వాటికి బదులుగా సహజసిద్ధంగా తయారు చేసిన పలు హోం రెసిపీని వినియోగించాల్సిందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. నిమ్మకాయ, కలబంద, పసుపు, కొబ్బరి నూనెతో తయారు చేసిన ఈ రెసిపీని ప్రతి రోజూ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
 
నిమ్మకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో భాస్వరం, కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే యాసిడ్స్ ముఖం ఛాయను మార్చేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ వినియోగించడం వల్ల ముఖంపై మరకలు తొలగిపోతాయి. ఇదే క్రమంలో కలబంద చర్మానికి అప్లై చేస్తే రెట్టింపు ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కలబంద, పసుపు, నిమ్మకాయ మరియు కొబ్బరి నూనెతో తయారుచేసిన రెసిపీని వినియోగిస్తే.. కొద్ది రోజుల్లోనే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోయింగ్ స్కిన్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
అలోవెరా జెల్‌
అర టీస్పూన్ - పసుపు
నిమ్మ రసం
ఒక టీస్పూన్ కొబ్బరి నూనె

తయారి పద్దతి:
దేశీ అలోవెరా తెచ్చి కోయండి.
తర్వాత దాని గుజ్జును చెంచాతో తీయండి. ఈ గుజ్జును ఒక గిన్నెలో వేయండి.
తర్వాత అందులో అర టీస్పూన్ పసుపు కలపాలి.
సగం నిమ్మకాయను పిండాలి.
ఒక చెంచా కొబ్బరి నూనె కలపండి.
తర్వాత వాటన్నింటినీ బాగా కలపాలి.
ఇలా చేస్తే మీ ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది.

ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి:
ఈ ఫేస్ ప్యాక్‌ని క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీనిని అప్లై చేయడానికి ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని  రాత్రి పడుకునే ముందు దీన్ని ముఖానికి రాసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News