Innova Hycross Vs Fortuner: ఇన్నోవా-ఫార్చ్యూనర్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో (SUV) అదే బెస్ట్‌! అవును అతి చౌకలో!

Innova Hycross Vs Fortuner: టయోటా ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్ రెండిటినీ కంపేర్‌ చేసి చూస్తే, ఫార్చ్యూనర్ బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 05:48 PM IST
Innova Hycross Vs Fortuner: ఇన్నోవా-ఫార్చ్యూనర్.. ఈ రెండు ఎస్‌యూవీల్లో (SUV) అదే బెస్ట్‌! అవును అతి చౌకలో!

Toyota Innova Hycross Vs Fortuner: టయోటా కంపెనీ కార్లకు మార్కెట్‌లో హ్యూండై కంటే ఎక్కువ డిమాండ్‌ ఉంది. టయోటా ఫార్చ్యూనర్‌కైతే విశిష్ట గుర్తింపు ఉంది. అయితే ఇటీవల టయోటా నుంచి మరో కారు భారత మార్కెట్‌లోకి విడుదలైంది. దానికి ఇన్నోవా హైక్రాస్‌ను అనే నామకరణంతో లాంచ్‌ చేశారు. ఇది అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో లభిస్తోంది. మంచి బడ్జెట్‌లో కారును కొనుగోలు చేయాలకుంటే ఇది సరైన కారుగా భావించవచ్చు. అయితే ఇటీవల చాలా మంది నెటిజన్లు ఫార్చ్యూనర్‌తో పాటు ఇన్నోవా హైక్రాస్‌ను పోల్చి వెబ్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఈ రోజూ మనం ఈ రెండు కార్ల మధ్య వ్యత్యాసాలు తెలుసుకోబోతున్నాం.

  • టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను ఫార్చ్యూనర్‌ను కంపేర్‌ చేసి చూస్తే ఫ్రంట్-ఎండ్‌లో LED హెడ్‌ల్యాంప్ సెటప్‌లు కలిగి ఉన్నాయి. కానీ ఫార్చ్యూనర్‌లో మాత్రం  ప్రొజెక్టర్ యూనిట్ల ల్యాంప్స్‌లు ఉన్నాయి. రెండు వాహనాల ఫ్రంట్ గ్రిల్ బోల్డ్‌గా కనిపిస్తూ.. ప్రీమియం లుక్‌లో ఉంటాయి. ఇన్నోవా హైక్రాస్ టాప్-ఎండ్ ZX మోడల్ మాత్రమే ఫాగ్ ల్యాంప్స్ లభించనున్నాయి. అంతేకాకుండా ఇవి రెండిటిలో ఫాగ్ ల్యాంప్‌ సిస్టమ్‌ రాకపోవడం విశేషం.
  • సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పనవసరం లేదు.  రెండు SUVలు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. ఇన్నోవాకి 360-డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫార్చ్యూనర్‌కి పుడ్ల్ ల్యాంప్‌లు మాత్రమే లభిస్తున్నాయి. లైన్ క్రోమ్‌ విషయాలకొస్తే ఫార్చ్యూనర్‌కి ఉంది. ఇన్నోవా హైక్రాస్ VX వేరియంట్‌కు క్రోమ్ లేదు. అంతేకాకుండా రెండు వాహనాలకు పార్కింగ్ సెన్సార్లు, వెనుక పార్కింగ్ కెమెరా ఉన్నాయి. ఫార్చ్యూనర్‌లో ఎలక్ట్రికల్‌ ఓపెనింగ్, క్లోజింగ్ టెయిల్‌గేట్‌ ఉన్నాయి.  ఇన్నోవా హైక్రాస్ VX మాన్యువల్ యూనిట్‌ మాత్రమే అందుబాటులో లభిస్తున్నాయి.
  • టయోటా ఇన్నోవా హైక్రాస్ మూడు వరుస సీట్లతో ఉండి పెద్ద మొత్తంలో బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఫార్చ్యూనర్ బ్లాక్ షేడ్‌లో లెదర్ ర్యాప్డ్ సీట్‌లను కంపెనీ అందిస్తోంది. ఫార్చ్యూనర్ 8 సీట్ల కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్నోవా హైక్రాస్ 7, 8 సీట్ల కాన్ఫిగరేషన్‌లతో కూడా మార్కెట్‌లో లభిస్తోంది. స్పేస్ పరంగా ఇన్నోవా హైక్రాస్ మరింత విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఫార్చ్యూనర్‌లో ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. హైక్రాస్ VX వేరియంట్ మెరుగైన హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు
  • ఇన్నోవా హైక్రాస్‌లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తోంది. అంతేకాకుండా లక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరెన్నో కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫార్చ్యూనర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 184 Psతో పాటు 188 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది E-CVT గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. కాబట్టి మీరు SUV కావాలంటే ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయోచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News