Sheezan Khan granted bail: 'అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్'లో ప్రధాన పాత్ర పోషిస్తున్న షీజన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అతని మాజీ ప్రేయసి, నటి తునీషా శర్మ మృతి కేసులో 69 రోజులుగా షీజన్ జైలులో ఉన్నారు. 2022లో తునీషా ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాక జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డాడు షీజన్. ఇక షీజన్ బెయిల్ కోసం అతని కుటుంబం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
ఇక వార్తా సంస్థ ANI ప్రకారం, షీజన్కు రూ. 1 లక్ష బాండ్‌పై వసాయ్ కోర్టు షీజన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు షీజన్ పాస్‌పోర్టును కూడా సమర్పించాల్సిందిగా కోరింది. తద్వారా షీజన్ దేశం నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉండదు. అలాగే సాక్ష్యాధారాలను తారుమారు చేయరాదని, సాక్షులను సంప్రదించకూడదనే షరతుతో షీజన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షీజన్ సోదరి ఫలక్ నాజ్ ఆయనకు బెయిల్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. నటి తునీషా శర్మ గత సంవత్సరం డిసెంబర్ 24 న షో కోసం మేకప్ వేసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది, ఆ తర్వాత ఆమె తల్లి షీజాన్ ఖాన్‌ను నిందించింది.
తన కుమార్తె ఆత్మహత్యకు షీజానే కారణమని నటి తల్లి ఆరోపించింది. ఈ క్రమంలో డిసెంబర్ 25న షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 69 రోజుల పాటు షీజన్ జైల్లోనే ఉన్నాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ షీజన్ తరపు న్యాయవాది ఖండించారు. పోలీసులు షీజన్ ఖాన్‌పై 524 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, ఇందులో షీజన్ ఖాన్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. ఇక ఆ సెక్షన్ ప్రకారం షీజన్కు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తునీషా చనిపోయే ముందు షీజన్‌తో మాట్లాడినందున ఆ సమయంలో షీజన్‌పై అనుమానం వచ్చింది. దీంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. షీజాన్ ఖాన్, తునీషా శర్మ 'అలీ బాబా'లో లీడ్ రోల్స్ లో నటించారు. లడఖ్‌లో జరిగిన షూటింగ్లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నెలల తరబడి డేటింగ్ చేసిన తునీషాతో షీజన్ డిసెంబర్లో విడిపోయాడు. తునీషాను షీజన్ మోసం చేస్తున్నాడని నటి తల్లి పేర్కొంది. ఈ విషయం తునీషాకు తెలియడంతో ఆమె బ్రేకప్ చెప్పిందని, అలా చెప్పినా తునీషా డిప్రెషన్‌కు గురయ్యిందని, చాలాసార్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యిందని కూడా ఆరోపించింది.
Also Read: Nandamuri Chaitanya Krishna Breathe Movie: మరో నందమూరి హీరో ఎంట్రీ.. బ్రీత్ అంటూ వచ్చేస్తున్నాడు!
Also Read: Hollywood Touch for NTR 30 : ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఇక తగ్గేదేలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి