Russian Scientist Andrey Botikov Murder: రష్యన్ శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ దారుణ హత్యకు గురయ్యారు. కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ Vను అభివృద్ధి చేయడంలో వైరాలజిస్ట్ ఆండ్రీ బోటికోవ్ ఒకరు. గురువారం ఆయన తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. శాస్త్రవేత్త ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి.. డబ్బు విషయంలో గొడవకు దిగి బెల్టుతో హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బోటికోవ్ రష్యాలో ఫేమస్ సైంటిస్ట్. ఆయన వ్యాక్సిన్‌పై చేసిన కృషికి గానూ 'ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్ల్యాండ్'అవార్డును కూడా అందుకున్నారు. 2020లో స్పుత్నిక్ V వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలలో బోటికోవ్ ఆయన కూడా ఒకరు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీలో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. గతంలో డీఐ ఇవనోవ్స్కీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సంబంధించిన రష్యన్ స్టేట్ కలెక్షన్ ఆఫ్ వైరస్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు.
ఆండ్రీ బోటికోవ్ మృతిపై విచారణ కొనసాగుతోందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. బోటికోవ్ మృతదేహాన్ని గుర్తించిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొంది. నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు దర్యాప్తు బృందం యోచిస్తోంది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సైంటిస్ట్ బోటికోవ్‌ను దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ హత్య ఘటనను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఖండించాయి. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడాయి.
Also Read: New Zealand Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. తేరుకునేలోపే మళ్లీ ఇలా..!
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook