Sourav Ganguly on Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పంత్.. ప్రస్తుతం ఇంటి వద్ద ఉండి మెల్లమెల్లగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కోలుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా.. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రిషబ్ పంత్ రీఎంట్రీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ ఇంకా చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉందన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ.. పంత్‌తో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. "నేను అతనితో రెండు సార్లు మాట్లాడాను. సహజంగానే అతను గాయాలు, శస్త్రచికిత్సల ద్వారా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాడు. నేను అతని క్షేమం కోరుకుంటున్నాను. పంత్ ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాలలో తిరిగి జట్టులోకి వస్తాడు.." అని తెలిపాడు.
పంత్ దాదాపు 6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చని గతనెలలో నివేదికలు వచ్చాయి. పంత్ తిరిగి వచ్చే కచ్చితమైన తేదీ చెప్పకపోయినా.. వన్డే వరల్డ్ కప్ వరకు కోలుకుంటాడని అందరూ అనుకున్నారు. అయితే పంత్ రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వస్తే (గంగూలీ సూచించినట్లుగా) ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ మాత్రమే కాదు.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా తప్పుకుంటాడు. గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ఢిల్లీ జట్టు పంత్ స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు. యువ ఆటగాడు అభిషేక్ పోరెల్, అనుభవజ్ఞుడైన షెల్డన్ జాక్సన్‌లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ బాధ్యతలు స్వీకరించగా.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరింనున్నాడు.
గంగూలీ మార్గదర్శకత్వంలో కోల్‌కతాలో మూడు రోజుల శిబిరం నిర్వహించింది ఢిల్లీ జట్టు. ఇందులో పృథ్వీ షా, ఇషాంత్ శర్మ, చేతన్ సకారియా, మనీష్ పాండే, ఇతర దేశీయ ఆటగాళ్లు పాల్గొన్నారు. సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'ఐపీఎల్‌కు ఇంకా ఒక నెల సమయం ఉంది. సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది. వారు ఆడే క్రికెట్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆటగాళ్లందరినీ ఒకచోట చేర్చడం కష్టం. నలుగురైదుగురు ఆటగాళ్లు ఇరానీ ట్రోఫీ ఆడుతున్నారు. సర్ఫరాజ్ వేలికి గాయమైంది. అతని వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. అతను ఐపీఎల్ వరకు ఫిట్‌గా ఉండాలి..' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?
Also Read: Tax Saving Tips 2023: ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా..? సింపుల్‌గా పన్ను ఆదా చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook