జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మార్చ్ నెలలో గ్రహాల గోచారం అధికంగా ఉన్నందున కొన్ని రాశులపై విశేష ప్రభావం పడనుంది. ముఖ్యంగా కన్యారాశి జాతకులకు ఎక్కడ అడుగేసినా లాభాలే ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ రాశివారికి గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు.
హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం మార్చ్ నెల కన్యారాశివారికి చాలా అద్భుతంగా ఉండనుంది. కష్టపడటం, ఇతరులతో సంబంధాలు, కుటుంబ సభ్యులతో వ్యవహారం, ఉద్యోగులకు పాజిటివ్ పరిణామాలు, కెరీర్‌రంగంలో మంచి అవకాశాలు, ఆర్ధిక సవాళ్లు ఇలా అన్ని రకాలుగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగు కానప్పుడు లేదా ఏదైనా పని సరిగ్గా జరగకపోతే చికాకు కలుగుతుంటుంది. వరుడి కోసం చేసే అణ్వేషణ ఫలిస్తుంది. ఆలోచించి అడుగేస్తే మంచి జరుగుతుంది.
అధికారిక కార్యక్రమాల్లో పాజిటివ్ పరిణామాలు ఎదురౌతాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ ఉన్నతాధికారులతో ఏదైనా అంశంపై జరిగే వాదన ప్రభావం ఉద్యగంపై పడకుండా చూసుకోవాలి. ఏదైనా అంశంపై మిమ్మల్ని సలహా కోరితే మీరిచ్చే సలహా నిష్పక్షపాతంగా ఉండాలి. ఈ నెలలో కెరీర్‌రంగంలో ఉండేవారికి వివిధ రకాల సమస్యలు దూరమౌతాయి. కెరీర్‌లో మంచి పరిణామాలు కలగవచ్చు. అయితే స్థిరత్వం కోసం ఎక్కువ సమయం పడుతుంది.
వ్యాపారులకు ఈ నెల లాభాలు ఆర్జించేందుకు చాలా అనువైన సమయం. అయితే నష్టాలు కూడా ఎదురుకావచ్చు. నెల ప్రారంభమౌతూనే ఖర్చులు పెరగడం మొదలౌతుంది. అయితే ఊహించని ధనలాభం కూడా ఉంటుంది కాబట్టి పెద్దగా ఆర్ధిక ఇబ్బందులుండవు. అయితే ఖర్చులు నియంత్రించుకుంటే చాలా మంచిది. ఈ నెల ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ఆలోచన సాకారమౌతుంది. కుటుంబ జీవితంలో అనుకోనిది జరగవచ్చు. ఆస్థి విషయంలో కుటుంబంలో వివాదం ఏర్పడవచ్చు. ఫలితంగా మానసిక శాంతిని కోల్పోతారు. ధైర్యంగా ఉంటే అన్ని సమస్యల్ని ఎదుర్కోవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు నెల చివరి వరకూ కాస్త ప్రతికూలంగా ఉంటాయి. చిన్న విషయాలపై కోపగించుకోకుండా నియంత్రణ పాటించాలి.
కన్యా రాశివారికి ఈ నెలలో అంటే మార్చ్ నెలలో ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎలాంటి పెద్ద సమస్యలు తలెత్తవు. చిన్న చిన్న సమస్యలు సహజం. అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అన్ని విధాలా మంచిది.
Also read: Venus transit 2023: హోలీ అనంతరం ఈ 5 రాశులకు మహర్దశే, ఉహించని ధనవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook