Dead Cheap Realme c30 Phone: తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను అందించేందుకు రియల్ మీ ఎప్పుడూ ముందుంటుంది. భారత మార్కెట్లో రియల్ మీ ఫోన్ లకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ మధ్యతరగతి నుంచి ధనికులను దృష్టిలో పెట్టుకొని వారి వారికి కావాల్సిన స్మార్ట్ ఫోన్ లను తయారుచేస్తుంది. మిడిల్ క్లాస్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇటీవల మార్కెట్లోకి రియల్ మీ c30 (Realme c30) సిరీస్ తో ఓ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లభిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ వినియోగదారులకు డెడ్ ఛీప్ గా అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ మీ సి 30 మార్కెట్లోకి రూ.9,299 లకు విడుదల చేయగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో రూ. 2,550 డిస్కౌంట్తో కేవలం రూ.6,749కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ కు సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేస్తే.. ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అదనపు డిస్కౌంట్తో దాదాపు రూ.500 దాకా తగ్గింపు పొందవచ్చు.
ఎక్స్చేంజ్ ఆఫర్:
రియల్ మీ సి 30(Realme c30) పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ ని బట్టి మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. మీ ఫోన్ కండిషన్ బాగుంటే, దాదాపు మీకు రూ.6,200 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ ఫోన్ ని రూ. 549కే కొనుగోలు చేయవచ్చు. కేవలం ఈ ఆఫర్ మీ పాత మొబైల్ పై ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ డ్యామేజ్ అయిన, ఇతర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆఫర్ అప్లికేబుల్ కాదు.
ఇతర వివరాలు:
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా మూడు కలర్లలో అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే 3gb ర్యామ్ 32gb ఇంటర్నల్ స్టోరీస్ తో రియల్ మీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 5000mah లిథియం బ్యాటరీ కూడా అమర్చారు. దీంతో చార్జింగ్ పెట్టుకోకుండానే దాదాపు రెండు రోజులు దాకా ఈ ఫోన్ను వినియోగించవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే 8ఎంపి బిగ్ బ్యాక్ కెమెరాతో అందుబాటులో ఉంది.
Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా
Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో రెండవసారి విచారణకు అవినాష్ రెడ్డి, ఇవాళ అరెస్టు తప్పదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook