Income Tax Return Filing 2022-23: ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో చాలా జాగ్రతలు తీసుకోవాలి. లేకపోతే సరైన సమాచారాన్ని అందించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ దరఖాస్తు నింపే సమయంలో పన్ను చెల్లింపుదారుడు తన ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించాలి. కానీ కొందరు చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకుంటున్నారు. ఈ 5 ప్రధాన తప్పులలో ఏదైనా ఒకదానిపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.
ఐటీఆర్ ఫారమ్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే.. ఇన్కమ్ ట్యాక్స్ మీపై ఓ కన్నేసి ఉంచుతుంది. స్క్రూటినీ సమయంలో తప్పనిసరిగా అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి.
ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా ఐటీ శాఖ నోటీసులు పంపుతుంది. మీ ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే.
మీరు రిటర్న్‌లో టీడీఎస్ ఫైల్ చేసినట్లయితే.. ఆ చెల్లింపులో తేడా ఉంటే మీకు నోటీసు వస్తుంది. ముందుగా ఎంత టీడీఎస్ కట్ అవుతుందో ఎల్లప్పుడు ఓ కన్నేయండి.
మీరు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని అదే ఏడాది ఐటీఆర్‌లో చూపించాలి. ఐటీఆర్‌లో ఖాతాలు, ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ గురించి చాలా మంది సమాచారం ఇవ్వరు.
కొంతమంది ఐటీఆర్ రిటర్న్‌లో తప్పులు చేసి.. అవసరమైన సమాచారాన్ని వదిలివేస్తారు. ఇలా అయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. అందుకే నిఫుణులతో మాత్రమే ఐటీఆర్ ఫైల్ చేయడం ఉత్తమం.
మీ ఖాతాలో పెద్ద లావాదేవీ జరిగినా.. లేదా ఎక్కువ నగదు జమ అయినట్లయితే.. మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు అందుకోవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు అయితే.. అతను ఒక ఏడాదిలో రూ.12 లక్షలను తన ఖాతాలో వేసినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు ఎదుర్కునే అవకాశం ఉంది.