7th Pay Commission Latest Update: ఈసారి హోలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి 8న హోలీ జరగనుండగా.. అదే రోజు కేంద్రం నుంచి డీఏ పెంపుపై ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 28న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) నంబర్లను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేయనుంది. ఈ పాయింట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఉద్యోగులకు వారి రోజువారీ స్టైఫండ్‌ని నిర్ణయించడానికి ఏఐసీపీఐ సూచికను పరిగణలోకి తీసుకుంటారు. మార్చి 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
ఏఐసీపీఐ నంబర్లు ప్రతి నెల చివరి పని రోజున విడుదల అవుతాయి. డియర్నెస్ అలవెన్స్ 3 శాతం పెరుగుతుందని కొందరు అంటుండగా.. మరికొందరు నాలుగు శాతం పెరుగుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 38 శాతం డీఏ అందుతోంది. మూడు శాతం పెరిగితే ఎంత వస్తుంది..? 4 శాతం ప్రకటిస్తే ఎంత జీతం పెరుగుతుందో ఓసారి చెక్ చూద్దాం..
ప్రభుత్వం డీఏలో 3 శాతం పెంపు ప్రకటిస్తే.. 41 శాతానికి చేరుకుంటుంది.
- కనీస మూల వేతనం రూ.18,000 అయితే..
- డీఏ 41 శాతానికి పెంచితే నెలకు రూ.7,380 అవుతుంది
- ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం=రూ. 6,840/నెలకు
- నెలకు రూ.900 జీతం పెంపు (రూ.7,380-రూ.6,840)
- వార్షిక ఇంక్రిమెంట్ 900X12= రూ.10,800
కనీస మూల వేతనం రూ.56,900 తీసుకుంటే..
- డీఏ 41 శాతానికి పెంచితే.. నెలకు రూ 23,329 అవుతుంది.
- ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం=రూ.21,622/నెలకు
- నెలకు రూ.1,707 జీతం పెంపు (రూ.23,329-రూ.21,622)
- వార్షిక ఇంక్రిమెంట్ 1,707 X 12 = రూ.20,484
ప్రభుత్వం డీఏలో 4 శాతం పెంపు ప్రకటిస్తే.. 42 శాతానికి చేరుకుంటుంది.
కనీస ప్రాథమిక వేతనంపై లెక్కింపు ఇలా..
- ఉద్యోగి బేసిక్ శాలరీ–రూ.18 వేలు
- కొత్త డీఏ (42 శాతం)–నెలకు రూ.7,560
- ప్రస్తుత డీఏ (38 శాతం)–నెలకు రూ.6,840
- ఎంత డీఏ పెరగనుంది-నెలకు రూ.720 (రూ.7,560-రూ.6,840)
- వార్షిక జీతంలో పెంపు -720X12= రూ.8,640
గరిష్ట జీతం స్థాయిలో ఇలా..
- ఉద్యోగి బేసిక్ శాలరీ-రూ.56,900
- కొత్త డియర్నెస్ అలవెన్స్ (42 శాతం)-రూ.23,898
- ప్రస్తుత డీఏ (38 శాతం)-నెలకు రూ.21,622
- ఎంత డీఏ పెరగనుంది-నెలకు రూ.2276 (రూ.23,898-రూ.21,622)
- వార్షిక జీతంలో పెంపు -రూ.2276X12=రూ.27312
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి