Rangbhari Ekadashi 2023: రంగభరీ ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే.... ఇక మీరు పట్టిందల్లా బంగారమే..

Rangbhari Ekadashi 2023: రంగభరీ ఏకాదశి రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. అంతేకాకుండా మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 03:38 PM IST
Rangbhari Ekadashi 2023: రంగభరీ ఏకాదశి రోజున ఈ పనులు చేస్తే.... ఇక మీరు పట్టిందల్లా బంగారమే..

Rangbhari Ekadashi 2023 Date: ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని రంగభారీ ఏకాదశి అని పిలుస్తారు. దీనికే ఉసిరి ఏకాదశి, అమలకి ఏకాదశి అని పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈ రంగభారీ ఏకాదశి వ్రతాన్ని మార్చి 3న  జరుపుకోనున్నారు. ఈరోజునే శివుడు పార్వతీ తల్లిని వివాహం చేసుకున్న తర్వాత తొలిసారి కాశీ నగరానికి వెళ్లాడు. అప్పుడు ఆ నగరంలో నూతన వధూవరులకు రంగులు వేసి స్వాగతం పలికారు. అందుకే దీనికి రంగభరీ ఏకాదశి అని పేరు వచ్చింది. విష్ణువుతోపాటు పార్వతీపరమేశ్వరులను పూజించే ఏకైక ఏకాదశి ఇదే. ఈరోజున కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా మీరు మహాదేవుని అనుగ్రహం పొందవచ్చు. 

రంగభారీ ఏకాదశి 2023 ముహూర్తం
వారణాసిలో రంగభారీ ఏకాదశి నుండే హోలీ పండుగ ప్రారంభమవుతుంది. ఈసారి రంగభారీ ఏకాదశి 02 మార్చి 2023, గురువారం ఉదయం 06.39 గంటలకు ప్రారంభమై... మార్చి 03, 2023న ఉదయం 09.11 గంటలకు ముగుస్తుంది.
పూజ ముహూర్తం - ఉదయం 08:17 - ఉదయం 09:44 am (3 మార్చి 2023)
రంగభారీ ఏకాదశి ఉపవాస సమయం - ఉదయం 06.48- ఉదయం 09.09 (4 మార్చి 2023)

ఈ పరిహారాలు చేయండి
** మీరు డబ్బు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే... రంగభరీ ఏకాదశి రోజున శివలింగానికి తెల్ల చందనం పూయండి. అంతేకాకుండా శివ చాలీసా కూడా పఠించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. అంతేకాకుండా మీ ఇంటికి డబ్బు రాక మెుదలవుతుంది.  
** భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినా లేదా జీవిత భాగస్వామి మీ మాట వినకపోయినా.. రంగభారీ ఏకాదశి రోజున శివాలయంలో శివపార్వతులకు ఎరుపు గులాల్ నైవేద్యంగా సమర్పించండి. దీంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ అదృష్టం కూడా పెరుగుతుంది.  
** ఈరోజున పాలతో శివలింగానికి అభిషేకం చేసి.. అనంతరం బిల్వపత్రాన్ని సమర్పించండి. తర్వాత పార్వతీమాతకు మేకప్ వస్తువులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. 
** ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయను నైవేద్యంగా పెట్టడం వల్ల మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. అంతేకాకుండా మీకు డబ్బుకు లోటు ఉండదు.

Also Read: Budh Gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News