Pakistan Sends Old Things To Turkey: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భయంకరమైన భూకంపంలో ఇప్పటివరకు 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ కష్ట సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు టర్కీ, సిరియా దేశాలకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. పాకిస్థాన్ కూడా కూడా టర్కీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే సహాయం పేరుతో పాక్ చేసిన పనికి టర్కీ అధికారులు అవాక్కయ్యారు. పాకిస్థాన్ పంపిన బాక్సులు ఓపెన్ చూసి షాక్ అయ్యారు.
పేదరికం, అధిక ద్రవ్యోల్బణంతో ప్రస్తుతం పాకిస్థాన్ దేశం సతమతమవుతోంది. అదేవిధంగా గతేడాది విధ్వంసకర వరదలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నేపథ్యంలోనే గతంలో పాక్‌కు టర్కీ వరద సాయం అందించింది. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న టర్కీని ఆదుకోవాలని పాక్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే టర్కీ భూకంప బాధితులకు బాక్సులు పంపించింది. ఈ రిలీఫ్ మెటీరియల్‌ని టర్కీ అధికారులు తెరిచి చూడగా.. అది గతేడాది పాకిస్థాన్ వరదల సమయంలో తాము పంపిన బాక్స్ అని తేలింది. ఈ విషయాన్ని ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ ఓ న్యూస్ ఛానెల్లో వెల్లడించారు.
పైన బాక్సులు మార్చినా.. లోపల మాత్రం పాక్ వరద సాయం అని ఉండడంతో పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టర్కీకి పంపిన ఈ సాయాన్ని పాక్ ప్రధాని షరీఫ్ దగ్గర ఉండి మరి పర్యవేక్షించడం విశేషం. పాక్ సీనియర్ జర్నలిస్ట్ షాహిద్ మంజూర్ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్ నుంచి అంకారాకు పంపిన భూకంప సహాయక సామగ్రి.. దేశంలో వరదల తరువాత టర్కీ గతేడాది పాకిస్థాన్‌కు పంపిన మెటీరియల్‌నే అని తెలిపారు. రిలీఫ్ మెటీరియల్‌పై పాకిస్థాన్ ప్రభుత్వ ముద్ర వేసిందని చెప్పారు. పాకిస్థాన్ టర్కీకి పంపిన రిలీఫ్ మెటీరియల్‌లో 21 కంటైనర్లు ఉన్నాయి. వీటిలో శీతాకాలపు టెంట్లు, దుప్పట్లు, ఇతర అవసరమైన వస్తువులు ఉన్నాయి.
Pakistan NEVER failed to entertain us !
Pakistan’s disaster relief team carried the SAME aid material to Turkey which they got from Turkey during floods relief this year😅😁 pic.twitter.com/OMBt0qqlxu
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) February 17, 2023
కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ దేశంలో భయంకరమైన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా దేశాలు పాక్‌కు సాయం చేశాయి. సహాయం చేసిన వారిలో టర్కీ కూడా ఉంది. ఆ తరువాత ఫిబ్రవరి 6న టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో టర్కీకి సాయం పేరుతో పాకిస్థాన్ చేసిన పనిని అందరూ తప్పుబడుతున్నారు.
Also Read: YS Sharmila: నువ్వు రా కొ**.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
Also Read: Ind VS Aus: నాథన్ లైయన్ పంజా.. అక్షర్ పటేల్ ఎదురుదాడి.. రసపట్టులో రెండో టెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook