బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయం: వైసీపీ

ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

Last Updated : Jul 16, 2018, 12:57 PM IST
బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేయాలని నిర్ణయం: వైసీపీ

ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ వద్ద ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్.. మూడు గంటల పాటు పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై చర్చించారు. సమావేశం అనంతరం ఆ పార్టీ నేత  ధర్మాన ప్రసాదరావు వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చనందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇక పదవులు కోల్పోయిన మాజీ ఎంపీలు సమావేశాలు ముగిసేంత కాలం పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలుపుతారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వానికి తమ పార్టీ ఎన్నో విజ్ఞాపనలు చేసిందని.. చివరకి ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా ఇచ్చిందని.. అప్పటికీ స్పందన రాకపోవడంతో పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని, అది ఇవ్వనందుకే బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయించామన్నారు.

సంఘమిత్రలకు రూ. 10వేల జీతం: వైఎస్ జగన్

తాము అధికారంలో రాగానే డ్వాక్రా సంఘల్లోని సంఘమిత్రలకు, వీఏవో, వెలుగు యానిమేటర్లకు నెలకు రూ.10వేలు వేతనంగా ఇస్తామని వైఎస్ జగన్ అన్నారు. తూ.గో. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా సంఘమిత్రులు, వీఏవో, వెలుగు యానిమేటర్లు జగన్‌ను కలిసి తమ  గోడును వెళ్లబోసుకున్నారు. డ్వాక్రా సఘాలను బలోపేతం చేసేందుకు వారి వేతనాలను పెంచుతున్నట్లు జగన్ తెలిపారు.

Trending News