Shani Asta 30 January 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. మొత్తం 9 గ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఎవరి జాతకంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. శనిదేవుడు రేపు అంటే జనవరి 30, 2023న కుంభరాశిలో అస్తమించనున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ అస్తమయం మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మేషరాశి
శని దేవుడి అస్తమయం మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మీకు ఎవరి నుండైనా డబ్బులు రావాల్సి ఉంటే అవి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అడ్డంకులు వస్తాయి. ప్రస్తుతం ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది.
వృషభం
కుంభరాశిలో శని సంచారం వృత్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసవారికి పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిధునరాశి
శనిదేవుని తిరోగమన స్థితిలో ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. శని తిరోగమనం వల్ల మీ తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రణాళిక వేసుకునే వారు కొంచెం ఆలస్యం కావచ్చు.
కర్కాటకం
శని అస్తమయం మీకు అననుకూలంగా ఉంటుంది. అత్తమామలతో బంధం బలపడుతుంది. ఆకస్మిక లాభనష్టాలు ఉంటాయి. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
సింహరాశి
ఈ రాశి యెుక్క ఏడవ ఇంట్లో శని అస్తమిస్తున్నాడు. ప్రేమ వ్యవహారంలో లేదా వ్యాపార భాగస్వామితో చిన్నపాటి వివాదాలు రావచ్చు. అపార్థాలు తలెత్తవచ్చు. ప్రయివేటు రంగంలో పని చేసే వ్యక్తులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
కన్య
మీ రాశి యెుక్క ఆరో ఇంట్లో శనిదేవుడు అస్తమిస్తున్నాడు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఆగుతుంది.
తులారాశి
శని మీ రాశి యెుక్క ఐదవ ఇంట్లో సెట్ చేయబడుతుంది. దీని వల్ల సంబంధాలు ప్రభావితం అవుతాయి. రుణాన్ని చెల్లించడంలో ఇబ్బందులు పడతారు.
వృశ్చిక రాశి
ఈ రాశి యెుక్క నాల్గవ ఇంట్లో శనిదేవుడు ఉండటం ద్వారా తల్లితో సంబంధంలో హెచ్చు తగ్గులకు కారణం కావచ్చు. ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. మోసానికి గురై అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
శనిదేవుడు ధనుస్సు రాశి యొక్క మూడవ ఇంటిలో సంచరిస్తాడు.ఉద్యోగ సంబంధిత ప్రయాణాలలో సమస్యలను ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రయాణం చేయవచ్చు. తోబుట్టువులతో సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.
మకరరాశి
ఈ రాశి యెుక్క రెండవ ఇంట్లో శని అస్తమిస్తాడు. దీంతో కుటుంబంలో గొడవలు వస్తాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టడం మానుకోండి.
కుంభ రాశి
కుంభరాశి యొక్క లగ్న గృహంలో శని సెట్ అవుతుంది. దీంతో ఈ రాశివారిపై సడే సతి రెండో దశ కూడా జరుగుతోంది. తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతింటాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగస్తులు కార్యాలయంలో ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కోంటారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
మీనరాశి
ప్రస్తుతం మీన రాశి వారికి శనిదేవుని సడే సతి మొదటి దశ కొనసాగుతోంది. ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో శనిదేవుడు అస్తమిస్తాడు. ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
Also read: Venus transit 2023: మిత్రుడి రాశిలో శుక్రుడి గోచారం.. ఈ రాశులకు కలిసి రానున్న కాలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
రేపు కుంభరాశిలో అస్తమించనున్న శనిదేవుడు.. ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసా?