Trivikram Gets Oscar ఆస్కార్ రేంజ్‌లో మన తెలుగు వారు ఎదుగుతారని, మన తెలుగు సినిమాలు ఆస్కార్ నామినేషన్ల వరకు వెళ్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డు మన తెలుగు సినిమాకు, పాటకు వస్తుందని అస్సలు ఊహించి ఉండరు. ఇప్పుడు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చే అవకాశం ఉంది. అసలు నామినేషన్ వరకు ఉండటమే గొప్ప విషయం. ఇది రాజమౌళి కీరవాణి ద్వయానికి మాత్రమే సాధ్యమైంది.
ఇంత వరకు ఏ ఒక్క ఇండియన్ దర్శకుడు తెరకెక్కించిన సినిమాకు ఇలాంటి గౌరవం, రికార్డ్ గానీ దక్కలేదు. అయితే ఇదే విషయాన్ని తమన్‌ను అడిగితే.. త్రివిక్రమ్ తమను ఆస్కార్ వరకు తీసుకెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు త్రివిక్రమ్ మీద నమ్మకం ఉండటం, ఆస్కార్ వరకు తీసుకెళ్తాడని చెప్పడం వరకు ఓకే గానీ.. కాస్త రియాల్టీలో తమన్ ఆలోచించలేకపోయాడని నెటిజన్లు అంటున్నారు.
— Darling Prabhas (@ChinniC19299168) January 27, 2023
త్రివిక్రమ్ సినిమాల కథలు ఎప్పుడూ కూడా కొత్తగా ఉండవు. అక్కడో ఇక్కడో లేపేసిన కథలకు తనదైన కథనాన్ని రాసుకుంటాడు. మాటలతో మంత్రం వేస్తాడు. ప్రాసలతో కట్టిపడేస్తుంటారు. అలాంటి సినిమాలు ఆస్కార్ వరకు వెళ్తాయని తమన్ చెప్పడమే ఇక్కడ కాస్త హాస్యాస్పదంగా మారుతుంది. అలాంటి త్రివిక్రమ్ ఆస్కార్ వరకు తమను తీసుకెళ్తాడని సంగీత దర్శకుడు తమన్ చెప్పడం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ఎన్ని తిప్పలు పడ్డారో అందరికీ తెలిసిందే. ముందు అనుకున్న కథను పక్కన పెట్టి.. కొత్త కథ, అది కూడా పూర్తి స్క్రిప్ట్‌తో వస్తేనే గానీ సెట్స్ మీదకు రానని మహేష్ బాబు అనడంతోనే ఇంత ఆలస్యమైన విషయం తెలిసిందే.
చివరకు త్రివిక్రమ్ కూర్చుని మొత్తం స్క్రిప్ట్ రాసి మహేష్ బాబుకి వినిపించడం, అది నచ్చడంతో ఓకే చెప్పడం.. ఆ తరువాత సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది. అంతకు ముందు తమిళ ఫైట్ మాస్టర్లు అన్బరివ్‌తో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook