Sania Mirza Australian Open 2023: భారత టెన్నిస్ దిగ్గజ సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్ కల చెదిరింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సానియా-రోహన్ బోపన్న జోడీ 7-6, 6-2తో బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ-రాఫెల్ మాటోస్ చేతిలో ఓడిపోయింది. సానియాకు ఇదే చివరి గ్రాండ్‌స్లామ్. ఈ మ్యాచ్ అనంతరం సానియా మీర్జా భావోద్వేగానికి గురైంది. తన టెన్నిస్ జర్నీ గురించి మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. యూఏఈలో డబ్ల్యూటీఏ 1000 ఛాంపియన్‌షిప్ ఆడిన తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.
మీడియాతో మాట్లాడుతూ సానియా మీర్జా కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మెల్‌బోర్న్‌లోనే మొదలైందని.. గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుదని తాను అనుకోవట్లేదని తెలిపింది. 'నేను 2005లో 18 ఏళ్ల వయస్సులో ఇక్కడ కెరీర్ ప్రారంభించాను. ఇక్కడ నా ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. నా జీవితంలో రాడ్ లావర్ ఎరీనాకు ఖచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంది.
నా కుమారుడు ఇజాన్, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కావడం ఈ సందర్భాన్ని ప్రత్యేకం చేసింది. నా కొడుకు ముందు గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. అది నాకు వెరీ స్పెషల్. రోహన్ భార్య, నా కోచ్, నా కుటుంబం ఆస్ట్రేలియాలోనే ఉండడంతో సొంతూంట్లో ఉన్నట్లు అనిపిస్తోంది..' అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి సెట్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ గట్టి పోటీనిచ్చింది. బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్‌తో తొలి సెట్‌లో 6-7 తేడాతో ఓడిన భారత జోడీ.. రెండో సెట్‌లో 6-2 తేడాతో కోల్పోయి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో గ్రాండ్‌స్లామ్ గెలిచి కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలన్న సానియా కల నెరవేరలేదు. సానియా ఖాతాలో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో మూడు మహిళల డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2009, ఫ్రెంచ్ ఓపెన్ 2012, US ఓపెన్ 2014 టైటిళ్లు ఉన్నాయి. సానియా 2022లోనే రిటైరవ్వాలని భావించింది. అయితే గాయం కారణంగా చివరిగా యూఎస్ ఓపెన్ ఆడలేకపోయింది.
Also Read: Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?
Also Read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook