అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఇవాళ్టి నుంచి ఓపెన్ అయిపోయింది. ఈ ఎఫ్‌పీవో ద్వారా ద్వారా కంపెనీ 20 వేల కోట్ల సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కోసం ఇవాళ అంటే జనవరి 27 నుంచి జనవరి 31 వరకూ వేలం పాడవచ్చు. ఇవాళ మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ గురించి పరిశీలిస్తే..3405 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.
గ్రే మార్కెట్లో ధర ఎంత
అదానీ ఎఫ్‌పీవో జనవరి 27న ఓపెన్ అయింది. జనవరి 31 న క్లోజ్ అవుతుంది. ఎఫ్‌పీవో కింద కంపెనీ 3112 రూపాయల్నించి 3276 రూపాయలు ప్రతి షేర్‌కు ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. కంపెనీ ఎఫ్‌పీవో గ్రే మార్కెట్లో 45 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. లోయర్ బ్యాండ్‌పై కంపెనీ షేర్ 13.5 శాతం డిస్కౌంట్ అందుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లకు 64 రూపాయలు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తోంది.
అదానీ కంపెనీ ఈ ఎఫ్‌పీవో ద్వారా సమీకరించే 20 వేల కోట్ల రూపాయల్లో 10,869 కోట్ల రూపాల్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా..4,165 కోట్ల రూపాయలతో విమానాశ్రయాలు, రోడ్డు రవాణా, ఇతర కంపెనీల రుణాల్ని చెల్లించనున్నారు.
కంపెనీ పాక్షికంగా పెయిడ్ బేసిస్‌పై షేర్లను జారీ చేయనుంది. ఈ ఎఫ్‌పీవో షేర్లు లభించిన రిటైల్ ఇన్వెస్టర్లకు కంపెనీ 2 లేదా 3 వాయిదాల్లో డబ్బులు చెల్లించవచ్చని కోరనుంది. ఎఫ్‌పీవోలో 35 శాతం కోటా రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. షేర్ల అలాట్మెంట్ ఫిబ్రవరి 3న కేటాయించనున్నారు. అటు లిస్టింగ్ తేదీ అయితే ఫిబ్రవరి 8వ తేదీన ఉంటుంది.
Also read: Second Hand Maruti Baleno Cars: ఆల్టో ధరకే మారుతి బాలెనో కార్స్.. ఎగబడి కొంటున్న జనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook