Virat Kohli Records: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ రెండు సెంచరీలు చేయడం విశేషం. మూడో వన్డేలో శతకంతో సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే వంటి దిగ్గజాల రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో ఎన్నో భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డుకు కోహ్లీ కేవలం మూడు సెంచరీల దూరంలో ఉన్నాడు. మూడో వన్డేలో తన వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనింగ్ కాకుండా.. మరోస్థానంలో బ్యాటింగ్ చేస్తూ వన్డే క్రికెట్‌లో గరిష్టంగా ఐదుసార్లు 150 పరుగుల మార్కును దాటిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. ఇందులో ఓపెనర్‌గా 8 సార్లు ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు.
విరాట్ కోహ్లీ స్వదేశంలో అత్యధికంగా సెంచరీలు (21) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు సచిన్ (20) పేరిట ఉన్న రికార్డును అధికమించాడు. అదేవిధంగా ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై కోహ్లీ అత్యధికంగా 10 సెంచరీలు చేశాడు. గతంలో ఆసీస్‌పై సచిన్ టెండూల్కర్ 9 శతకాలు బాదాడు.
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల పరంగా శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ మహేల జయవర్ధనేని కోహ్లీ అధిగమించాడు. వన్డేల్లో కోహ్లీ 259 ఇన్నింగ్స్‌ల్లో 12754 పరుగులు చేశాడు. మహేల జయవర్ధనే తన వన్డే కెరీర్‌లో మొత్తం 12,650 రన్స్ చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (18426) ఉన్నాడు.
కోహ్లీ మొత్తం అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 74కి చేరుకుంది. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్‌కు ముందు విరాట్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతకుముందే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల (49) రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొడతడాని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఇంకా చాలా వన్డేలు ఆడాల్సి ఉంది.
Also Read: TS Teachers Transfers: సీఎం కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్.. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Also Read: విరాట్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. 73 పరుగులకే శ్రీలంక ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి