Sesame Laddu For Blood Pressure Problems: చలి కాలంలో చాలా మంది చిరుదిండ్లు తినేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ క్రమంలో చాలా మంది లడ్డులను, స్వీట్స్‌ను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే మకర సంక్రాంతి పండగ రోజులు కావడంతో అందురూ నువ్వులతో తయారు చేసిన లడ్డులను ఎక్కువగా తింటూ ఉంటారు. నువ్వుల లడ్డులను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలున్నాయని వీటిని ప్రతి రోజూ తినడం వల్ల బాడీకి కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు అందుతాయి. అయితే ఇదే లడ్డులను నెయ్యితో తయారు చేసుకుని తింటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని చలి కాలంలో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ సమస్యలకు ప్రభావవంతంగా సహాయపడుతుంది:
ఎముకలను బలంగా చేస్తుంది:
నువ్వులలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటితో తయారు చేసిన లడ్డులను ప్రతి రోజూ తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పుల సమస్యను దూరం చేస్తాయి.
రక్తపోటు సమస్యలు:
నువ్వుల్లో ఉండే గుణాలు రక్తపోటును అదుపులో ఉంచేందుకు కీలకంగా సహాయపడతాయి. హైబీపీ సమస్యలతో బాధపడుతున్నవారికి నువ్వుల లడ్డు చాలా సహాయపడుతుంది. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక శక్తి:
నువ్వులు రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. నువ్వుల లడ్డూలు తినడం వల్ల అంటు వ్యాధులను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో నువ్వులను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్:
నువ్వుల్లో ఉండే గుణాలు గుండెకు మేలు చేస్తాయి. ఇందులో సెసామిన్, సెసామోలిన్ అనే పదార్థాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం
Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook