Shani Asta Impacts on Zodiac Signs: మరో నాలుగు రోజుల్లో శనిదేవుడు తన రాశిని మార్చి కుంభరాశిలో సంచరించనున్నాడు. ఆ తర్వాత జనవరి 30న శనిదేవుడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. శని సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. శని స్థానం యెుక్క మార్పు కారణంగా మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. శనిదేవుడు గోచారం (Saturn Planet Asta in Kumbh 2023) వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శనిదేవుడి సంచారం ఈ రాశులకు అశుభం
కర్కాటకం (Cancer): శని సంచారం కర్కాటక రాశి వారికి వృత్తి, ఆరోగ్యం మరియు గృహ రంగాలలో అనేక సవాళ్లను తెస్తుంది. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఉద్యోగం మారాలన్నా, వ్యాపారం చేయాలన్నా లేదా పెట్టుబడి పెట్టాలన్నా ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి, మీ లైఫ్ పార్టనర్ తో విభేదించకండి. ఈ కాలంలోఎవరికీ అప్పు ఇవ్వకండి. మీరు మానసిక ఒత్తిడి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
సింహం (Leo): సింహ రాశికి అధిపతి సూర్యుడు. శని, సూర్యభగవానుడు ఇద్దరూ శత్రువులు. శని యెుక్క సంచారం వల్ల మీరు ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే చాలా నష్టపోతారు. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. ఈసమయంలో మీరు కొత్త పనులు చేయడం మానుకోండి.
వృశ్చికం (Scorpio): శని అస్తమించడం వల్ల వృశ్చిక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ డబ్బు మీకు తిరిగి రాదు. శనిగ్రహం యొక్క అశుభ ప్రభావాల వల్ల మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఈ సమయంలో తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. శని సంచారం మీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది అగిపోతుంది.
శని యొక్క అశుభ ప్రభావాలను కలిగి ఉండే వ్యక్తులు శని రక్ష కవచాన్ని పఠించాలి. దీనికి ముందు శని దేవుడిని పద్దతిగా పూజించి ఆ తర్వాతే శని రక్ష కవచాన్ని పఠించాలి.
Also Read: Budh Margi 2023: బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక.. ఈ 3 రాశులవారికి కష్టాలే ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి