Acne Treatment: ప్రస్తుతం మొటిమల సమస్య చాలా సాధారణమైంది. అయితే ఈ సమస్యల బారిన పడేవారు ఎక్కువ ఆందోళన చెందల్సిన అవసరం లేదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వివిధ రకాల మాత్రలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చందనం వినియోగించండి:
మొటిమల సమస్యలతో బాధపడేవారు చందనం పొడిని కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించండి. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా చెంచా గంధపు పొడిని తీసుకుని..అందులో కొంచెం తేనె కలపాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపి మొటిమలు ఉన్న చోట అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మీరు సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో విటమిన్-ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. అయితే దీనిని మొటిమల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా గోరువెచ్చని నూనె తీసుకుని అందులో తేనె కలిసి మొటిమలపై రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే సులభంగా మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం కూడా మెరుగుపడుతుంది.
ఆపిల్ వెనిగర్:
యాపిల్ వెనిగర్‌ను వినియోగించడం వల్ల కూడా మొటిమల సమస్యను అధిగమించవచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక చెంచా వెనిగర్ తీసుకుని అందులో రెండు చెంచాల తేనె వేసి, కొద్దిగా నీళ్లు వేసి మిశ్రమంలా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను కాటన్ సహాయంతో మొటిమల మీద అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook