TVS Motor Company launches TVS Metro Plus 110 CC in Bangladesh: 'టీవీఎస్ మోటార్ కంపెనీ' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో బైక్స్ అందిస్తూ పాపులర్ అయింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ రూపొందించడంతో టీవీఎస్ జనాల్లోకి వెళ్ళిపోయింది. టీవీఎస్ ఎప్పటికపుడు కొత్త బైక్స్ మార్కెట్‌లోకి తీసుకొస్తూ సక్సెస్ అయింది. తాజాగా 'మెట్రో ప్లస్ 110' బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ బాంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. కొత్త మెట్రో ప్లస్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ ఇది. ఈ బైక్ హెడ్‌ల్యాంప్‌లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-టోన్ కలర్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.
టీవీఎస్ మెట్రో ప్లస్ 110 (TVS Metro Plus 110) ధర 1.25 లక్షల టాకా (బంగ్లాదేశీ కరెన్సీ) నుంచి ప్రారంభమవుతాయి. ఈ బైక్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్). మెట్రో ప్లస్ 110 బైక్ 109.7cc, సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. ఇది 7,500 RPM వద్ద 8.29 bhp శక్తిని మరియు 5,000 RPM వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ వెనుకవైపు డ్రమ్ బ్రేక్, ముందువైపు డిస్క్ లేదా డ్రమ్ ఎంపిక ఇవ్వబడింది. మైలేజ్ కూడా ఇతర టీవీఎస్ బైక్స్ మాదిరే ఇవ్వనుంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బిజినెస్) రాహుల్ నాయక్ మాట్లాడుతూ... 'మా కీలక అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటైన బంగ్లాదేశ్‌లో కొత్త టీవీఎస్ మెట్రో ప్లస్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము. మా విస్తృత సేవా నెట్‌వర్క్‌తో ఖచ్చితంగా మేము కస్టమర్‌ను సంతృప్తి చెందిస్తాం. అంతేకాదు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తామనే నమ్మకం ఉంది' అని అన్నారు.
టీవీఎస్ ఆటో బంగ్లాదేశ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. ఇక్రమ్ హుస్సేన్ మాట్లాడుతూ... టీవీఎస్ మెట్రో ప్లస్ దేశంలో టీవీఎస్ మోటార్ యొక్క పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసే ఫీచర్లతో వస్తుంది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంటుంది. టీవీఎస్ మోటార్ కంపెనీతో మా 15 సంవత్సరాల సుదీర్ఘ మరియు నిబద్ధత అనుబంధం.. మోపెడ్‌లు, మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్‌ల అభివృద్ధికి దారితీసింది' అని పేర్కొన్నారు.
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడిని వందేళ్లకు ఓసారే చూస్తాం: కపిల్ దేవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.