/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

BCCI Former selector Saba Karim  hails Axar Patel for best bowling in Final over: మంగళవారం ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగుల అవసరమైన తరుణంలో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా అక్షర్‌ పటేల్ చేతికి బంతిని ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్షర్‌ తన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాడు. చివరి ఓవర్లో వరుస బంతుల్లో వైడ్‌, 1, 0, 6, 0, వికెట్‌, వికెట్‌ తీశాడు.

ఆఖరి ఓవర్లో 13 పరుగులు డిఫెండ్ చేసిన అక్షర్ పటేల్.. అంతకుముందు 20 బంతుల్లో 31 పరుగులు చేసి భారత్ స్కోరు 160 దాటేలా చేశాడు. ఆల్‌రౌండర్‌ ప్రతిభతో ఆకట్టుకున్న పటేల్‌పై పొగడ్తల వర్షం కురుస్తోంది. బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ సాబా కరీమ్‌ తాజాగా ఆల్‌రౌండర్‌ అక్షర్ ప్రతిభను ప్రశంసించాడు. ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో సాబా కరీమ్‌ మాట్లాడుతూ... 'హార్దిక్ పాండ్యా కారణంగా ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయలేదు. అందుకే బంతిని అక్షర్ పటేల్‌కు ఇవ్వవలసి వచ్చింది. నిజానికి అక్షర్‌కు ఇది చాలా కఠినమైన సవాలు. భారీ షాట్లు ఆడగల బ్యాటర్‌ క్రీజులో ఉన్న సమయంలో 13 పరుగులు డిఫెండింగ్ చేయడం ఎప్పటికీ సులభం కాదు' అని అన్నారు. 

'అక్షర్ పటేల్ చాలా తెలివిగా బౌలింగ్ చేసాడు. ఫుల్ లెంగ్త్ డెలివరీలతో బ్యాటర్‌ను బోల్తా కొట్టించాడు. ఒక్క షార్ట్ బాల్ సందిస్తే.. అది సిక్సర్‌ వెళ్లింది. ఆ ఒక్క బంతి తప్ప అక్షర్ అద్భుత బంతులు వేశాడు. ఇక ఒక దశలో భారత్ 150 పరుగుల మార్కును చేరుకోవడం కష్టమే అనిపించింది. దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లు బాగా ఆడారు. వారికీ నా కృతజ్ఞతలు. సవాలుతో కూడిన టోటల్‌ను లంక ముందు ఉంచగలిగారు' అని సబా కరీమ్ తెలిపారు. ఇక శ్రీలంకతో కీలకమైన రెండో టీ20 పుణె వేదికగా గురువారం జరగనుంది.

Also Read: IPL 2023: ఐపీఎల్ ఆడకుంటే వచ్చే నష్టమేం లేదు.. రోహిత్, కోహ్లీలను హెచ్చరించిన బీజేపీ ఎంపీ!  

Also Read: Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Section: 
English Title: 
IND vs SL: BCCI Former selector Saba Karim lauded Axar Patel for Defended 13 runs in Final over vs Sri Lanka
News Source: 
Home Title: 

IND vs SL: అక్షర్ పటేల్ తెలివితేటలను మెచ్చుకున్న బీసీసీఐ మాజీ సెలెక్టర్!

IND vs SL: అక్షర్ పటేల్ తెలివితేటలను మెచ్చుకున్న బీసీసీఐ మాజీ సెలెక్టర్!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రెండు పరుగుల తేడాతో విజయం

13 పరుగులను డిఫెండింగ్ చేసిన అక్షర్ 

పటేల్ తెలివితేటలను మెచ్చుకున్న సాబా
 

Mobile Title: 
IND vs SL: అక్షర్ పటేల్ తెలివితేటలను మెచ్చుకున్న బీసీసీఐ మాజీ సెలెక్టర్!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Wednesday, January 4, 2023 - 18:42
Request Count: 
22
Is Breaking News: 
No