Improve digestion in winter: ప్రస్తుతం భారత దేశంలో చలి కాలం ప్రారంభమైంది. ఇదే క్రమంలో ఆకు కూరలు, కూరగాయలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చాలా మంది వాటిని విచ్చవిడిగా తింటూ ఉంటారు. అయితే చలి కాలంలో కేవలం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కొంతమందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కూరగాయలు తీసుకోకపోవడం చాలా మంచిదని కూడా ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చలి కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ కూరగాలను చలి కాలంలో తీసుకోకపోవడం చాలా మంచిది:
టొమాటోలు:
చలి కాలంలో రాత్రి నిద్రపోయే ముందు టొమాటోలతో చేసిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాత్రిపూట వాటితో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే టొమటో అమైనో ఆమ్లల పరిమాణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు చలి కాలంలో రాత్రి పూట తీసుకుంటే నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బ్రోకలీ:
బ్రోకలీ కూడా చలి కాలంలో అతిగా తీసుకోవడం శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వాటిల్లో ట్రిప్టోఫాన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ రాత్రి ఆహారంలో తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
చికెన్:
ప్రస్తుతం చాలా మంది చలి కాలంలో రాత్రి పూట చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఇలా చేయడం శరీరానికి చాలా ఆహానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. కాబట్టి చలి కాలంలో రాత్రి పూట తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి.
కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి:
విచ్చల విడిగా స్పైసీ ఫుడ్ తినడానికి అలవాటు పడతారు. ఇలా చేయడం వల్ల పొట్టకు చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాత్రి పూట కారంతో ఉన్న ఆహారాలు తినడం వల్ల నిద్ర లేమి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్
Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి