Myron Mohit Remand Report: హీరోయిన్ భర్త రిమాండ్ రిపోర్టులో సంచలనం.. షారుఖ ఖాన్ కొడుకు కేసులో కూడా?

Myron Mohit Remand Report: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త, ప్రముఖ డీజే ఆర్గనైజర్ మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా అతని రిమాండు రిపోర్టులో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు     

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 2, 2023, 06:44 PM IST
Myron Mohit Remand Report: హీరోయిన్ భర్త రిమాండ్ రిపోర్టులో సంచలనం.. షారుఖ ఖాన్ కొడుకు కేసులో కూడా?

Myron Mohith Remand Report: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నేహా దేశ్ పాండే భర్త, ప్రముఖ డీజే ఆర్గనైజర్ మైరాన్ మోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మైరాన్ మోహిత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. షారుక్ ఖాన్ కుమారుడు పట్టుబడిన ఒక డ్రగ్స్ కేసులో కూడా మైరాన్ మోహిత్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఎక్కడైతే షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయ్యాడో అదే ముంబై క్రూయిజ్ లో ఆ స్మాయంలో మైరాన్ డీజే పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ముంబై, గోవాలోని ప్రముఖ పబ్బులకు కూడా అతను డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా అతనికి హైదరాబాద్ లో పలు పబ్బు ఓనర్లతో కూడా సంబంధాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో పబ్ ఓనర్స్ ద్వారా ఏమైనా డ్రగ్స్ సరఫరా చేశారా? అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఒక ప్రముఖ డీజే ద్వారా పబ్స్ లో డ్రగ్స్ సప్లై చేశారని గోవా నుంచి స్లీపర్ కోచ్ బస్సుల ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెప్పించిన మైరాన్ మోహిత్ వాటిని డీజేల ద్వారా పబ్బులలో సప్లై చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అతనికి 50 మంది డ్రగ్స్ పెడ్లర్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి బంధువు, వ్యాపారవేత్త అయిన మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేయడంతో మరిన్ని కొత్త లింకులు బయటపడినట్లుగా కూడా చెబుతున్నారు.

2019లో ఎక్సైజ్ శాఖ ఎప్పుడైతే డ్రగ్స్ కేసు వెలుగులోకి తీసుకొచ్చిందో అందులో కృష్ణ కిషోర్ పాత్ర ఉందని గుర్తించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. దీంతో అప్పుడు అతను అరెస్టు బారి నుంచి బయటపడ్డాడు. అయితే కృష్ణ కిషోర్ రెడ్డి కదలికలపై గత కొంతకాలంగా హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ నిఘా పెట్టడంతో న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కృష్ణ కిషోర్ రెడ్డి ని అరెస్ట్ చేయడంతో ఈ మైరాన్ మోహిత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: Neha Desh Pandey Husband: ఏపీ మాజీ మంత్రి బంధువుతో డ్రగ్స్ వ్యాపారం.. టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్!

Also Read: Bairi Naresh Remand Report: బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కుట్రపూరితంగానే అయ్యప్పపై వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x