Bandi Sanjay Clarity on BJP-TDP Alliance in Telangana: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి, ఈసారి ఎలా అయినా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ అందుకు పనికి వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈమధ్య ఖమ్మంలో టిడిపి సభ ఏర్పాటు చేసి చంద్రబాబును ముఖ్యఅతిథిగా పిలిస్తే ఆ సభకు అసంఖ్యాక జనం హాజరయ్యారు.
బిజెపిని ఆకట్టుకునేందుకే చంద్రబాబు ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారని అటు టిఆర్ఎస్ ఇటు వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఏర్పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొంత మంది బీజేపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులలో కూడా ఈ అంశం మీద కన్ఫ్యూజన్ నెలకొంది. తెలుగు దేశంతో పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
అయితే ఇదే విషయం మీద తాజాగా జరిగిన బీజేపీ కీలక నాయకుల సమావేశంలో ఈ అంశం మీద నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని ఆమె కోరడంతో దానికి ఎంపీ అరవింద్ కూడా దానిమీద క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే విజయశాంతి మళ్ళీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడమే కాక ఆ ప్రభావం ఇప్పటికీ దాని మీద ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే బిజెపి శ్రేణులు భయాలు ఉన్నాయని మాకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని వారు భావిస్తున్నారని పేర్కొనగా దీనిపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని పేర్కొన్న ఆయన ఇదే విషయాన్ని కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలకు చేరవేసే బాధ్యత నేతలు అందరి మీద ఉందని పేర్కొన్నారు.
ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్లి మనం తెలుగు దేశంతో ముందుకు వెళ్లడం లేదనే విషయాన్ని గట్టిగా చెప్పాలని ఆయన నేతలకు సూచించారు. ఈ క్రమంలో తెలుగుదేశం బీజేపీ పొత్తు వార్తలకు ఇక బ్రేక్ పడినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే బిజెపిలోని మరో వర్గం మాత్రం బండి సంజయ్ క్లారిటీ ఇచ్చినా అధిష్టానం అని అధిష్టానం కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామని ఆదేశాలిస్తే ఖచ్చితంగా బండి సంజయ్ ఫాలో అవ్వాల్సిందేనని చెబుతున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Rishabh Pant Rescuer: రిషబ్ పంత్‌ను కాపాడింది ఎవరో తెలుసా.. ఇంతకీ రోడ్డుపై ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook