New Year 2023: 45 రోజుల పాటు ఈ ట్రిక్ పాటిస్తే... 2023 అంతా మీకు డబ్బే డబ్బు..

Shani Remedies: శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అలాంటి శనిదేవుని అనుగ్రహం మీపై ఏడాది పొడవునా ఉండాలంటే ఇంట్లో ఈ మెుక్కను నాటండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 09:22 AM IST
New Year 2023: 45 రోజుల పాటు ఈ ట్రిక్ పాటిస్తే... 2023 అంతా మీకు డబ్బే డబ్బు..

New Year 2023 Remedies:  మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్ రానుంది. కొత్త సంవత్సరంలోనైనా తమకు అదృష్టం కలిసి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీకు 2023 బాగుండాలంటే ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. మనం కొన్ని పవిత్రమైన మెుక్కలను దేవతామూర్తుల ప్రతి రూపాలుగా కొలుస్తాం. శనిదేవుడికి సంబంధించి ఆస్ట్రాలజీలో కొన్ని మెుక్కలు చెప్పబడ్డాయి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం చాలా మంచిది. 

డిసెంబరు 31న శనివారం వస్తుంది. శని అనుగ్రహం పొందాలంటే ఇంట్లో శమీ మొక్కను నాటాలి. ఈ ఫ్లాంట్ ను నాటడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి... గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. డిసెంబరు 31 నుంచి వరుసగా 45 రోజుల పాటు శమీ మొక్కను నిత్యం పూజిస్తే ఏడాది పొడవునా మీరు అపారమైన ధనాన్ని పొందుతారు. 

2023లో ఈ పనులు చేయండి
>> మీ కెరీర్ లో ఇబ్బందులు ఉంటే.. ఇంట్లో శమీ మెుక్కను నాటడం మరియు క్రమం తప్పకుండా పూజించడం మంచిది.
>> శనివారం ఇంట్లో శమీ మొక్కను నాటడం ద్వారా మీకు ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. దీంతో డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. 
>> ఇంట్లో వాస్తు దోషం ఉంటే... శమీ మొక్కను నాటడం ద్వారా అది పోతుందని నమ్ముతారు.
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ మొక్క దగ్గర వరుసగా 45 రోజుల పాటు నెయ్యి దీపం వెలిగిస్తే వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి.
>> ప్రదోష కాలంలో శమీ మొక్కను పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ఆ మెుక్కకు నీళ్లు పోసి... దాని దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. 
>> ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనాలంటే.. ఆ ఇంటి యజమాని శమీ మొక్కను పూజించాలి. బుధవారం నాడు గణేశుడికి శమీ మొక్క ఆకులను నైవేద్యంగా సమర్పించడం వల్ల శాంతి చేకూరుతుంది.

Also Read: Lucky Zodiac 2023: అరుదైన ధన యోగం... న్యూ ఇయర్ లో ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News