Shani Gochar: 2023లో ఈ 3 రాశులపై శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు.. ఇక వీరికి డబ్బే డబ్బు...

 Shani Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శనిదేవుడు 2023లో కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 09:11 AM IST
Shani Gochar: 2023లో ఈ 3 రాశులపై శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు.. ఇక వీరికి డబ్బే డబ్బు...

Shani Gochar In Kumbh: 2023 సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు జనవరి 17న త్రికోణ స్థితిలో కుంభరాశిలో (Saturn transit in Aquarius 2023) సంచరించబోతున్నాడు. శనిదేవుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల కొత్త ఏడాదిలో మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

 మకర రాశిచక్రం (Capricorn): ఈ రాశి వారు శని దేవుడి సంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరం ఆస్తి కొనుగోళ్లు మరియు అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. చమురు, ఖనిజాలు, పెట్రోలియం మరియు ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు మంచి డబ్బును సాధిస్తారు. 

కుంభం (Aquarius): కుంభ రాశి వారు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే శని దేవుడు మీ రాశికి అధిపతి. మరోవైపు, శని దేవుడు మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. నిరుద్యోగుల జాబ్ కల ఫలిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

వృషభ రాశి (Taurus): 2023లో మిమ్మల్ని శనిదేవుని ఆశీర్వాదం పొందబోతున్నారు. ఎందుకంటే శనిదేవుడు వృషభరాశికి అధిపతి. శని దేవుడు మీ జాతకంలోని పదో ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు కొత్త ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. నిజాయితీ కృషి చేస్తే మీరు మీ లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు. 

Also Read: Venus transit 2023: త్వరలో శుక్రుడి మీన సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News