Weight Loss Diet: ఊబకాయం ప్రస్తుతం సాధరణ వ్యాధిగా మారిపోయింది. ఈ సమస్యతో కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు జీవిన శైలిలో మార్పులు, శరీర శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొంగరగా ఊబకాయం వ్యాధి నుంచి ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు, ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే స్థూలకాయాన్ని సులభంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
తేనె:
ఊబకాయాన్ని సులభంగా తగ్గించుకోవడానికి సులభైన మార్గం ఏమిటంటే..గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని ప్రతి రోజూ తాగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజూ తేనె నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సుభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఇదే నీటిలో పసుపు కూడా కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
దాల్చిన చెక్క:
ఆహారాల రుచిని పెంచడానికి దాల్చిన చెక్క ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు రుచిని పెంచడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని కోసం మీరు ఈ చెక్క పొడిని తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి.. 15 నిమిషాలు మరిగించి, అందులోనే ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియ రేటును వేగవంతం చేసేందుకు కూడా సహాయపడతాయి.
నిమ్మకాయ:
నిమ్మకాయలో విటమిన్-సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చలి కాలంలో నిమ్మ రసాన్ని ఆహారాల్లో వినియోగించడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook