Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్

Ind Vs Ban 2nd Test: రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ చిత్తయింది. మూడు వికెట్లతో తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 11:37 AM IST
Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్

Ind Vs Ban 2nd Test: రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఓటమి నుంచి కోలుకుని బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి భారత్‌ను బంగ్లా బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. ఒకదశలో 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. శ్రేయస్ అయ్యర్ (29), రవిచంద్రన్ అశ్విన్ (42) అద్భుతంగా ఆడారు. ఇద్దరు వికెట్లను కాచుకుంటూ.. టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు అక్షర్ పటేల్ (34) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ హాసన్ ఐదు, షకీబుల్ హాసన్ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.  

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 314 రన్స్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 231 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 145 పరుగుల టార్గెట్ విధించింది.
 
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను బంగ్లా బౌలర్ల బాగా ఇబ్బంది పెట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), విరాట్ కోహ్లీ (1), పుజారా (6) పరుగులకే వెనుదిరిగారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కేవలం 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆటలోనూ బంగ్లా బౌలర్లు అద్భతుంగా బౌలింగ్ చేశారు. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన జయదేవ్ ఉనద్కట్ (13)ను షకీబుల్ హాసన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం 34 పరుగులు చేసి క్రీజ్‌లో నిలదొక్కుకున్న అక్షర్ పటేల్‌ను మెహదీ హసన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను 9 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడం ఓటమి ఖాయమనుకున్నారు.

కానీ శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ బంగ్లా బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ.. టీమిండియాను విజయ తీరాలవైపు నడిపించారు. చివర్లో అశ్విన్ 6,4,4 బాది భారత్‌ను గెలిపించాడు. వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్ట్ సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశ్విన్‌కు, మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ అవార్డు పుజారాకు దక్కాయి. 

Also Read: సంక్రాంతికి సొంతూరికి వెళ్లే వారికి శుభవార్త.. అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..

Also Read: Chalapathi Rao Cried: మిమ్మల్ని మళ్లీ చూస్తామో లేదో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చలపతి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News