N Chandrababu Naidu, Nandamuri Balakrishna condolence to Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ (87) ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కైకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసి సంతాపం ప్రకటిస్తున్నారు. సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీను వైట్ల ట్వీట్స్ చేశారు.
'కైకాల సత్యనారాయణ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా అలరించారు. మా కుటుంబంతో ఆయనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నాన్న గారితో కలిసి ఎన్నో సినిమాల చేశారు. నా చిత్రాల్లో కూడా నటించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితం, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకున్నారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంన్నా' అని బాలకృష్ణ ట్వీట్ చేశారు.
'తన విలక్షణ నటనతో అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం చాలా విచారకరం. ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
'కైకాల సత్యనారాయణ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'అని రామ్ చరణ్ ట్వీటారు.
'తెలుగు చిత్ర పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు ఆయనకు సరిగ్గా నప్పేది. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయనను వెండితెరపై అందరం మిస్ అవుతాం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అని శ్రీను వైట్ల పేర్కొన్నారు.
'తెలుగు సినీ పరిశ్రమలో నేను అభిమానించే నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఇంట్లో మనిషిలా ఆయన కలిసిపోయేవారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కైకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని నాని ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం వేరే.. కైకాల సత్యనారాయణ మరణంపై బాలకృష్ణ, చంద్రబాబు ఎమోషనల్!
ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధం వేరే
సత్యనారాయణ మరణంపై చంద్రబాబు ఎమోషనల్
తెలుగు సినీ రంగానికి తీరని లోటు