IPL Auction 2023 Date, Time and Live Streaming details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలంకు రంగం సిద్ధం అయింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎల్ 2023 వేలం ఆరంభం కానుంది. కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్లో వేలం జరగనుంది. ఈ వేలం కోసం బీసీసీఐ భారీగానే ఖర్చు చేస్తోంది. 7 గంటల పాటు జరిగే ఈ వేలం కోసం గ్రాండ్ హయత్ హోటల్లో మొత్తం రెండు ఫ్లోర్లను పూర్తిగా బీసీసీఐ బుక్ చేసింది. ఈ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో బ్రాడ్ కాస్ట్ అవుతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2023 వేలం కోసం స్వదేశీ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 10 ప్రాంఛైజీలు 405 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశాయి. 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. 87 స్థానాల కోసం ఈ వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు ఉండగా.. 57 స్థానాలు భారత ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి. ఈ వేలం ప్రక్రియ సెట్ల వారీగా జరుగనుంది. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లు ఉంటారు.
రెండో సెట్లో ఉన్న ఆల్‌రౌండర్ల కోసం 10 ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కరన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. అలానే తొలి సెట్లో ఉన్న రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్, ఎన్ జగదీశన్ లాంటి బ్యాటర్లు కూడా భారీ ధర పలకవచ్చు. ఆదిల్ రషీద్, ఆడమ్ జాంపా లాంటి స్పిన్నర్లకు కూడా ఈ వేలంలో జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2023లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లపై రూ. 743.5 కోట్లు ఖర్చు చేశాయి. ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ. 206.5 కోట్ల నిధులు ఉన్నాయి. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. సన్‌రైజర్స్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలుచేసే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్లను వదిలేసిన హైదరాబాద్.. ఆ స్థానాల్లో మంచి ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ.
విడిచిపెట్టిన ఆటగాళ్లు:
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.
Also Read: Gold Price Today: 55 వేల చేరువలో బంగారం ధర.. 70 వేలు దాటిన వెండి ధర!
Also Read: Kaikala Satyanarayana Death : నటుడు కైకాల కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.